Pailam Pilaga Trailer Launch: భారీ బడ్జెట్ సినిమాల కంటే.. చిన్న బడ్జెట్ సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిన్న బడ్జెట్ సినిమా పైలం పిలగా. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, పోస్టర్లు, పాటలు సినిమా మీద మంచి అంచనాలను ఏర్పరిచాయి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో విడుదల కి సిద్ధం అవుతుంది. టీజర్ తో బాగా ఆకట్టుకున్న చిత్రబృందం తాజాగా ఇప్పుడు.. సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా.. ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. పల్లె, పట్నం తేడా లేకుండా గ్లోబలైజేషన్ యుగంలో.. యువత మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెనకే పరిగెడుతున్నారు. లేదా వ్యాపారాలు అంటూ కోట్లు సంపాదించాలని కలనుకుంటున్నారు. కానీ ఒక యువకుడు మాత్రం తన సొంత ఊర్లోనే ఉండి తన భూమిలో వ్యాపారం చేస్తూ ఎదగాలని అనుకుంటాడు. అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? కెరియర్ లో అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది? చివరికి అనుకున్నది సాధించాడా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మంచి కంటెంట్ తో తీసిన సినిమా అయినప్పటికీ.. చాలా హాస్య భరితంగా చూపించడానికి ప్రయత్నించారు చిత్రా డైరెక్టర్. సాయి తేజ కల్వకోట, పావని కరణం ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.
ట్రైలర్ రిలీజ్ సందర్బంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ "సినిమా డైరెక్టర్ ఆనందం గుర్రం రాసిన ఊరెళ్ళిపోతా మావ, కంచె లేని దేశం పాటలకు నేను పెద్ద అభిమానిని. ఈ సినిమాలో పాటలు కూడా బాగున్నాయి. సినిమా ట్రైలర్ చూస్తే తన పాటల్లాగే సినిమా కూడా చాలా బాగుంటుంది అని అర్థం అవుతోంది. డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి" అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. అందరూ థియేటర్లోకి వచ్చి ఈ విలేజ్ డ్రామాని ఎక్స్పీరియన్స్ చేయాలని అన్నారు.
బాలకృష్ణ, వెంకటేష్, ఇంకా కొంతమంది బాలీవుడ్ ఆగ్రా హీరోలతో కూడా ఆడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా ఇది. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా మ్యాన్ గా సందీప్ బద్దుల వ్యవహరించగా.. ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దారేకర్ చూసుకున్నారు.
Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే
Also Read: Bank holidays in October: వామ్మో..అక్టోబర్‌లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ? జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.