Saindhav Review and Rating: సైంధవ్ రివ్యూ…సైకోగా మెప్పించిన వెంకటేష్.. ఆ ఒక్క విషయంలో తప్ప..

Saindhav Review: విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన చిత్రం సైంధవ్. మన వెంకీ మామ ఈ సినిమాకి భారీ లెవెల్ లో ప్రమోషన్స్ చేయగా ఈ చిత్రంపై అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా ఏర్పడ్డాయి. మరి సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 01:51 PM IST
Saindhav Review and Rating: సైంధవ్ రివ్యూ…సైకోగా మెప్పించిన వెంకటేష్.. ఆ ఒక్క విషయంలో తప్ప..

Saindhav Review: సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (విక్టరీ వెంకటేష్) కి తన పాప గాయత్రి (సారా) అంటే పంచప్రాణాలు. గాయత్రిని వారి ఇంటి పక్కన ఉండే మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్) చూసుకుంటూ ఉంటుంది. అయితే, గతంలో సైంధ‌వ్ చేసిన క్రైమ్ కారణంగా, కార్టెల్ లో అతని పేరు వింటేనే భయపడుతూ ఉంటారు. సైంధవ్ మాత్రం తన గతాన్ని పూర్తిగా వదిలేసి కూతురి కోసం బతుకుతుంటాడు. ఈ నేపథ్యంలో గాయత్రి స్పైనల్ మాస్క్యూలర్ ఎంట్రో అనే వ్యాధికి  గురవుతుంది. ఆ వ్యాధి నయం కావాలంటే రూ.17 కోట్ల విలువ కలిగిన వైల్ కావాలి. ఆ డబ్బుకోసం సైంధ‌వ్ ఏం చేశారు? ఈ క్రమంలో వికాస్ మాలిక్‌ (నవాజుద్దీన్) తో వచ్చిన గొడవ ఏమిటి ?, చివరకు సైంధ‌వ్ తన పాపని రక్షించుకున్నారా? అనేది మిగిలిన కథ.

నటినటులు పర్ఫామెన్స్.. టెక్నికల్ సిబ్బంది పనితీరు:

వెంకటేష్ గురించి.. ఇప్పుడు 75 సినిమాల తరువాత చెప్పేదేముంది. ఎప్పటిలానే అద్భుతంగా నటించారు.‌ సైంధవ్ కోనేరు అనే సైకో పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ హీరో గానే కాదు యాక్షన్ హీరోగా కూడా తను ఏంటి అనేది మరోసారి రుజువు చేసుకున్నారు. అతిధి పాత్రలో నటించిన ఆర్య కూడా మెప్పించింది. వెంకటేష్ తరువాత ఈ సినిమాలో ఆ రేంజ్ లో నటించింది నవాజుద్దీన్ సిద్ధిఖీ. వైలెన్ పాత్రలో తనదైన స్టైల్ చూపించారు ఈ నటుడు.‌ ఇక ముఖ్యపాత్రలో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ కూడా  చాలా బాగా నటించింది. రేణు గా రుహాని శర్మ.. జాస్మిన్‌ పాత్రలో ఆండ్రియా జెరెమియ కరెక్ట్ గా సరిపోయారు. జిషు సేన్‌గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. 

టెక్నికల్ సిబ్బంది పనితీరు విషయానికి వస్తే.. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ కి చాలా ముఖ్యమైనది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. అయితే సంగీత దర్శకుడు సంతోష్ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  ఇవ్వలేకపోయాడు. ఆయన అందించిన సంగీతం పరవాలేదు అనిపించుకున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ బాగుంది. అయితే, మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో.. అలానే కథను ఇంకొంచెం ఎఫెక్ట్ గా రాసుకోవడంలో విఫలం అయ్యారు. 

విశ్లేషణ

వెంకటేష్ 75వ సినిమా అనగానే ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉంటాయి. ఫ్యామిలీ హీరో అయినా వెంకటేష్ ఫ్యామిలీ చిత్రం కాకుండా తన 75 వ సినిమాగా ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎంచుకోవడంతో .. ఆ అంచనాలు మరింత పెరిగాయి. తప్పకుండా దర్శకుడు వెంకటేష్ ని ఒక కొత్త విధంగా చూపిస్తారు అని అందరూ అనుకున్నారు. సినిమాలో ప్రధాన కథాంశం, సైంధవ్ పాత్ర దానికి తగ్గట్టుగానే చాలా బాగున్నాయి. అయితే.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు నిరాశ పరిచాడు.

ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ గా సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి మొదలవుతుంది. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ సగం కి వచ్చేసరికి అసలు సమస్య మొదలవుతుంది. సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు దర్శకుడు. అయితే ఆ ఎమోషన్స్ కాసేపు వర్క్ అయినా ఆ తరువాత చాలా చోట్ల మెలో డ్రామాలా సాగాయి. ఇందుకు ముఖ్య కారణం డైరెక్టర్ ఎమోషన్స్ తో పాటు ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకుండా కథ రాసుకోవడం. 

పాప కోసం సైంధవ్ చేసిన పోరాటంలో ఎమోషన్ ఉన్నా, ట్రీట్మెంట్ లో సరైన కాన్ ఫ్లిక్ట్ మాత్రం బిల్డ్ అవ్వలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినవారికి ఈ కథ మొత్తం అర్థమైపోతుంది. అలాంటప్పుడు తీసే విధానం అద్భుతంగా ఉంటే మాత్రమే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోగలదు. కానీ ఆ విషయంలో దర్శకుడు కేవలం పరవాలేదు అనిపించుకున్నారు. 

ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నేరేషన్ మిస్ అయింది. విలన్ కి హీరో కి మధ్య వచ్చే గొడవ పాయింట్ కూడా మనకు పెద్దగా ఎక్కదు. ముఖ్యంగా అద్భుతమైన నటి నటులను ఎంచుకొని కూడా దర్శకుడు శైలేష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను మలచలేకపోయారు. తన గత సినిమాల లాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఎక్కువగా రాసుకో ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేదేమో. అయితే మొదటి నుంచి వెంకటేష్ నటన.. కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం ఈ సినిమాలో మెప్పిస్తూ రాగలిగాయి.

తీర్పు

కొంచెం స్లో నేరేషన్.. కొన్ని బోరింగ్ సీన్లు పక్కన పెడితే.. వెంకటేష్ అద్భుతమైన నటన.. హై వోల్టేజ్ యాక్షన్.. ఆకట్టుకునే ఎమోషన్స్ కోసం ఈ సినిమాని ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News