Vijay Antony injured: బిచ్చగాడు హీరోకి తీవ్ర గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

Vijay Antony Injured: అనేక సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి, తర్వాత నటుడిగా మారిన విజయ్ ఆంటోనీ అనేక సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఆయన సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 16, 2023, 08:50 PM IST
Vijay Antony injured: బిచ్చగాడు హీరోకి తీవ్ర గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

Vijay Antony Injured in Movie Shooting: తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన విజయ్ ఆంటోనీ అనేక సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. తర్వాత నటుడిగా మారిన ఆయన అనేక సినిమాల్లో హీరోగా నటించాడు. అయినా విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యాడు. ఆ తర్వాత దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయి విడుదలవుతున్నాయి. అయితే తాజాగా ఆయన బిచ్చగాడు పార్ట్ 2 షూటింగ్ చేస్తున్నారు. ఈ షూట్ చేస్తున్న సమయంలో మలేషియాలో గాయపడినట్లు తెలుస్తోంది.

ఆయన వాటర్ బోటులో ప్రయాణిస్తున్న సమయంలో ఆ బోటు సడన్గా కెమెరా సెటప్ ఉన్న మరో పడవలోకి దూసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా విజయ్ ఆంటోని గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే గాయపడిన విజయ్ ఆంటోని వాటర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారని, చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులందరూ మలేషియాకి బయలుదేరి వెళ్లినట్టుగా చెబుతున్నారు.

సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం మలేషియా సముద్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారని, విజయ్ ఆంటోని నడుపుతున్న వాటర్ బోటు కంట్రోల్ తప్పి కెమెరామెన్ అలాగే ఇతర సిబ్బంది ఉన్న మరో పడవని ఢీ కొట్టిందని తెలుస్తోంది. కౌలాలంపూర్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి వెంటనే ఆయన్ని తీసుకువెళ్లారని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అంటున్నారు. సంగీత దర్శకుడిగా నటుడిగా గాయకుడిగా అందరికీ పరిచయమైన ఆయన ఈ బిచ్చగాడు 2 సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

కొద్ది నెలల క్రితమే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. దానికి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు మలేషియాలో జరుగుతోందని లంగాకవి అనే ఒక ఐలాండ్ దగ్గరలో షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అప్పటికప్పుడు ప్రధమ చికిత్స నుంచి వెంటనే మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి దర్శకుడిగా మాత్రమే కాదు సంగీతం అందిస్తూనే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ ఆంటోనీతో పాటు జాన్ విజయ్, హరీష్ బెరాడి, మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు వంటి వారు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉంది.

Also Read: Dil Raju Love Story: 'రెండో భార్యతో లవ్ స్టోరీ' బయటపెట్టిన దిల్ రాజు.. అలా కుదిరేసిందట!

Also Read: Pallavi Joshi injured: కాశ్మీరీ ఫైల్స్ నటికి షూట్ లో యాక్సిడెంట్.. హుటాహుటిన హాస్పిటల్ కు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News