Vijay Devarakonda: మధ్యలో మోటివేషన్ కోల్పోయా: విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) మూవీతో మంచి క్రేజ్ సంపాదించకున్న హీరో విజయ్ దేవర కొండ. ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అవడం, విజయ్ ఆటిట్యూడ్ గురించి వార్తలు తరచూ వస్తోండటంతో అతనికి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.

Last Updated : Oct 13, 2020, 03:41 PM IST
    • అర్జున్ రెడ్డి మూవీతో మంచి క్రేజ్ సంపాదించకున్న హీరో విజయ్ దేవర కొండ.
    • ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అవడం, విజయ్ ఆటిట్యూడ్ గురించి వార్తలు తరచూ వస్తోండటంతో అతనికి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.
Vijay Devarakonda: మధ్యలో మోటివేషన్ కోల్పోయా: విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) మూవీతో మంచి క్రేజ్ సంపాదించకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అవడం, విజయ్ ఆటిట్యూడ్ గురించి వార్తలు తరచూ వస్తోండటంతో అతనికి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.

ALSO READ | Big Boss 4: గంగవ్వ బయటికి వెళ్లడానికి కారణం అదేనా ?

ఈ ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకునేందుకు హిట్ డైరక్టర్ పూరిజగన్నాథ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి ఇటీవలే పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశాడు విజయ్. 

ఫైటర్ మూవీ కోసం తను 8 నెలలుగా కసరత్తులు చేస్తున్నాను అని తలిపిన విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ).. మధ్యలో మోటివేషన్ కోల్పోయినట్టు తెలిపాడు. కానీ మళ్లీ సెల్ప్ మోటీవేట్ చేసుకొని కొనసాగుతున్నాను అని తెలిపాడు. ఇందులో ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడట విజయ్.

దీని కోసం సిక్స్ ప్యాక్స్ అవసరం. మంచి ఫైట్ చేసే వ్యక్తిగా కనిపించాలి. ఈ మూవీ పక్కా కమర్షియల్ మూవీ అనీ..పూరీ జగన్నాథ్ దీన్ని విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు అని తెలిపాడు. 

ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల చిత్రీకరణ కొన్ని నెలల పాటు నిలిచిన విషయం తెలిసిందే. అయితే త్వరలో విదేశాల్లో షూటింగ్ ప్రారంభం కానుంది అని సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ నటి అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. చార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.

Trending News