vijay: రేపే ‘మాస్టర్’ తెలుగు టీజర్ రిలీజ్

సౌత్ స్టార్ హీరో తలపతి విజ‌య్ (thalapathy vijay) న‌టిస్తోన్న తాజా చిత్రం ‘మాస్ట‌ర్’ ( master movie )‌. లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్‌ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

Last Updated : Dec 16, 2020, 04:25 PM IST
vijay: రేపే ‘మాస్టర్’ తెలుగు టీజర్ రిలీజ్

Thalapathy Vijay ‘Master’ movie telugu teaser: సౌత్ స్టార్ హీరో తలపతి విజ‌య్ ( thalapathy vijay ) న‌టిస్తోన్న తాజా చిత్రం ‘మాస్ట‌ర్’ ( master movie )‌. లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్‌ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు టీజర్ విడుదల కోసం ఎదురుచూసిన విజయ్ అభిమానులకు సర్‌ప్రైజ్ రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో అంటే రేపు సాయంత్రం తెలుగు ( Tollywood ) టీజర్ విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ బుధవారం వెల్లడించారు. Also read: Rakul Preet Singh: ఎవరో ఏదో ఇస్తే.. నేనెందుకు పని చేయాలి

ఈ మేరకు టాలీవుడ్ నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. డిసెంబ‌ర్ 17న సాయంత్రం 6 గంట‌ల‌కు మాస్ట‌ర్ టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంద‌ని ఆయన ట్విట్ చేశారు. మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఆయన విజయ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

అయితే.. లోకజ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న మాస్ట‌ర్ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. విలన్ రోల్‌లో మ‌రో కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి న‌టిస్తున్నాడు. విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. Also read: Mouni Roy: చురకత్తుల్లాంటి చూపులతో చంపేస్తున్న మౌనీ రాయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News