Mr Celebrity Movie: వినాయక చవితి స్పెషల్.. ఆ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం..!

Mr Celebrity Movie Songs: మిస్టర్ సెలబ్రిటీ మూవీ నుంచి వినాయక చవితి సందర్భంగా స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు వరలక్ష్మీ శరత్ కుమార్ అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. రీసెంట్‌గా టీజర్ విడుదల చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చింది. 

Written by - Ashok Krindinti | Last Updated : Sep 5, 2024, 06:41 PM IST
Mr Celebrity Movie: వినాయక చవితి స్పెషల్.. ఆ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం..!

Mr Celebrity Movie Songs: పరుచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలబ్రిటీ మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఊరు వాడ గణనాథుని నామస్మరణతో మార్మోగిపోతుంది. ఎటు చూసినా వినాయకులు సందడి నెలకొంది. శనివారం నుంచి మండపాల్లో బొజ్జ గణపయ్యలు కొలువుదీరనున్నారు. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి స్పెషల్‌గా ‘గజానన’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటను స్టార్ సింగర్ మంగ్లీ ఆలపించారు. గణష్‌ ఈ పాటను రాయగా.. వినోద్ బాణీలు సమకూర్చారు. గణేశుడి నవరాత్రుల్లో ఈ సాంగ్ మర్మోగిపోయేలా కనిపిస్తోంది.

Also Read: Chandrababu naidu:  చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. మూడడుగుల దూరంలో ఆగిన ట్రైన్.. అసలేం జరిగిందంటే..?

ఇక ఈ పాటలో వరలక్షీ శరత్ కుమార్ తన స్పెషల్ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఆకట్టుకునే స్టెప్పులతో విశ్వరూపం ప్రదర్శించారు. చాలా రోజుల తరువాత చాలా ఎనర్జీగా స్టెప్పులు వేసి అలరించారు. వీడియో చూస్తున్నంతసేపు 
నిజంగానే ఉత్సవం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ మూవీని ఎన్.పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. చందిన రవి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

సాంకేతిక వర్గం

==> బ్యానర్ - RP సినిమాస్
==> ప్రొడ్యూసర్ -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
==> రైటర్, డైరెక్టర్- చందిన రవి కిషోర్ 
==> కెమెరామెన్ - శివ కుమార్ దేవరకొండ
==> మ్యూజిక్- వినోద్ యజమాన్య
==> సాంగ్స్- గణేష్, రాంబాబు గోసాల
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వెంకట్ రెడ్డి
==> ఎడిటర్ - శివ శర్వాణి
==> PRO- సాయి సతీష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News