Vivek Agnihotri: భోపాలీ అంటే హోమో సెక్సువల్... 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు...

Vivek Agnihotri on Bhopali's : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'భోపాల్'ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భోపాలీ అంటే హోమోసెక్సువల్స్ అంటూ కొత్త అర్థం చెప్పారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 06:51 PM IST
  • డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అనుచిత వ్యాఖ్యలు
  • భోపాలీల అంటే కొత్త అర్థం చెప్పిన దర్శకుడు
  • దర్శకుడి వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ కౌంటర్
Vivek Agnihotri: భోపాలీ అంటే హోమో సెక్సువల్... 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు...

Vivek Agnihotri on Bhopali's : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'భోపాల్'ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భోపాలీ అంటే హోమోసెక్సువల్స్ అంటూ కొత్త అర్థం చెప్పారు. 'నేను పెరిగింది భోపాల్‌లోనే. కానీ నేను భోపాలీని కాదు. భోపాలీ అనే పదానికి వేరే అర్థం ఉంది. అది నన్ను ప్రైవేట్‌గా అడిగితే చెప్తా. లేదా మీరే ఎవరైనా భోపాలీని అడగండి చెప్తారు. మీరెవరినైనా భోపాలీ అని పిలిచారంటే.. దానర్థం అతను నవాబీ టేస్ట్‌తో ఉన్న హోమోసెక్సువల్ అని.' వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.

కశ్మీర్ ఫైల్స్ సినిమాకు సంబంధించి ఓ మీడియా చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వివేక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. 'వివేక్ అగ్నిహోత్రి గారు.. బహుశా ఇది మీ వ్యక్తిగత అనుభవం కావొచ్చు. అంతే తప్ప సగటు భోపాలీలకి సంబంధించినది కాదు. 1977 నుంచి నాకు భోపాల్‌తో, భోపాలీలతో అనుబంధం ఉంది. నాకెప్పుడూ ఇలాంటిది ఎదురుకాలేదు.' అని దిగ్విజయ్ పేర్కొన్నారు. అంతేకాదు, మీ చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావమై ఉండొచ్చునని చురకలంటించారు.

వివేక్ అగ్నిహోత్రి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి శుక్రవారం (మార్చి 25) ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వివేక్ అగ్నిహోత్రి అనుచిత వ్యాఖ్యలపై ఆయన్ను ప్రశ్నించారు. మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వివేక్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇదే విషయంపై బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గియాను ప్రశ్నించగా.. ఆ విషయం ఆయన్నే అడగండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Also read: Flipkart mobile fest: ఫ్లిప్​కార్ట్ మంత్​ ఎండ్ మొబైల్ సేల్​.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!

Also read: Realme C31: రియల్​మీ నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News