Bhola Shankar: మెగా లీక్.. పవన్ కల్యాణ్ మేనరిజాన్ని దించేసిన చిరంజీవి, వీడియో వైరల్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సీన్ ను లీక్ చేశారు చిరు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2023, 11:53 AM IST
Bhola Shankar: మెగా లీక్.. పవన్ కల్యాణ్ మేనరిజాన్ని దించేసిన చిరంజీవి, వీడియో వైరల్

Bhola Shankar Update: మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న చిత్రం భోళాశంకర్‌. ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటించింది. అంతేకాకుండా మెగాస్టార్ చెల్లెలిగా మహానటి కీర్తి సురేష్, మరో కీలపాత్రలో సుశాంత్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. భోళాశంకర్ నుంచి రిలీజైన టీజర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ లీక్ చేశారు మెగాస్టార్. ఆయన తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని రీక్రియేట్ చేసినట్లు గతంలో నెట్టింట వార్తలు వచ్చాయి. ఇప్పుడా ఆ విషయాన్ని నిజం చేస్తూ.. చిరంజీవి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

వీడియో ఓపెన్ చేస్తే.. ''కళ్యాణ్ బాబు తన సినిమాల్లో అప్పుడప్పుడూ నా డ్యాన్స్ లకు స్టెప్పులేస్తూ, నా డైలాగ్స్ చెబుతూ వినోదం పంచుతుంటాడు. అలా నేను కూడా భోళాశంకర్ లో తన మేనరిజమ్స్, తన పాటను అనుకరించి ఎంటర్ టైన్ చేస్తా. ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా'' అని మెుదట చిరు ఆడియో వినబడుతోంది. అనంతరం పవన్ ఖుషి సినిమాలోని 'యే మేరా జహా.. ' సాంగ్ కు పవన్ స్టైల్లో స్టెప్పులేసి ఆకట్టుకున్నారు చిరు. ''తమ్ముడు పాట మస్తుందిలే'' అంటూ ఈ వీడియోలో రష్మితో కలిసి సందడి చేశారు మెగాస్టార్. థియేటర్లలో ఈ సీన్‌కి మెగాభిమానులు ఎంజాయ్‌ చేస్తారని.. ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే నంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. 

Also Read: Samajavaragamana OTT: 'సామజవరగమన' ఓటీటీ ఫార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News