చైనాలో మనిషిలా ప్రవర్తిస్తున్న కోతి..!

చైనా రాజధాని బీజింగ్‌లో అచ్చం మనిషి మొహాన్ని పోలిన ఓ కోతిని ఓ జంతుప్రదర్శనశాలలో కనుగొన్నారు అక్కడి పాత్రికేయులు. 

Last Updated : Mar 26, 2018, 12:04 AM IST
చైనాలో మనిషిలా ప్రవర్తిస్తున్న కోతి..!

చైనా రాజధాని బీజింగ్‌లో అచ్చం మనిషి మొహాన్ని పోలిన ఓ కోతిని ఓ జంతుప్రదర్శనశాలలో కనుగొన్నారు అక్కడి పాత్రికేయులు. ఆ కోతి మొహంలో హావభావాలన్నీ అచ్చం మనిషిలా ఉండడంతో.. ఆ వానరాన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా వీడియో సైట్ వైబోలో ఇప్పటికే ఈ కోతి వీడియోని 8 మిలియన్ల మంది చూశారట. బీజింగ్‌లోని తియాంగ్ జంతుప్రదర్శనశాలలో ప్రస్తుతం ఈ కోతిని సంరక్షిస్తున్నారు. దీనిని బాగా అరుదైన బ్రీడ్‌కు చెందిన కోతి అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కోతి కళ్లు, ముక్కు, నోరు మొదలైనవి కదుపుతున్నప్పుడు మానవ ముఖ కవళికలనే కలిగి ఉన్న భావననే చూపరులకు కలిగించడం విశేషం. ఈ కోతికి మనుషులను అనుకరించడం కూడా వచ్చు. 

Trending News