పసిడి ప్రియులకు మరో షాకింగ్ న్యూస్

బంగారం ప్రియులకు మరో  షాకింగ్ న్యూస్..  గత కొన్ని రోజులుగా ఊహంచని స్థాయిలో పెరుగుతూ పోతున్న బంగారం ధర రూ.50 వేలు దాటే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది.

Last Updated : Feb 22, 2020, 01:59 PM IST
పసిడి ప్రియులకు మరో షాకింగ్ న్యూస్

హైదరాబాద్: బంగారం ప్రియులకు మరో  షాకింగ్ న్యూస్..  గత కొన్ని రోజులుగా ఊహంచని స్థాయిలో పెరుగుతూ పోతున్న బంగారం ధర రూ.50 వేలు దాటే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మదుపరుల్లో గుబులు రేపుతోంది. దీంతో ఇతర వాటితో పోలిస్తే బంగారంపై పెట్టుబడులు పెట్టడం మేలని భావిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ఊపందుకోవడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా రెండు రోజుల క్రితం 42 వేల మార్క్ దాటిన పసిడి ధర.. ప్రస్తుతం రూ.43 వేల వద్ద కొనసాగుతోంది. అయితే, ఇది ఇక్కడితో ఆగిపోదని, రూ.50 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయం వంటివి బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని కమోడిటీ విశ్లేషకులు చెబుతున్నారు. లోహాలపై పెట్టుబడులే సేఫ్ అని భావిస్తున్న మదుపర్లు ఈక్విటీలోని తమ పెట్టుబడులను అటువైపు మళ్లిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News