సోషల్‌మీడియా రేటింగ్స్‌లో "ఐపీఎల్" టాప్..!

2018 సంవత్సరంలో సోషల్ మీడియాలో కనీవినీ ఎరుగని రీతిలో నెటిజన్లను కనువిందు చేసిన ఘనత "ఐపీఎల్"కే దక్కింది. 

Last Updated : May 31, 2018, 01:33 PM IST
సోషల్‌మీడియా రేటింగ్స్‌లో "ఐపీఎల్" టాప్..!

2018 సంవత్సరంలో సోషల్ మీడియాలో కనీవినీ ఎరుగని రీతిలో నెటిజన్లను కనువిందు చేసిన ఘనత "ఐపీఎల్"కే దక్కింది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఐపీఎల్ వీరాభిమానులు ఒక రకంగా పండగ చేసుకొన్నారనే చెప్పవచ్చు. ఐపీఎల్ ప్రారంభం నుండి ముగిసే వరకూ  దాదాపు ఆ టాపిక్ మీద 425 మిలియన్ పోస్టులు , కామెంట్లు, రియాక్షన్లు నమోదు అయ్యాయట.

అలాగే ఐపీఎల్  ఫ్రాంచైసీల విషయానికి వస్తే, అన్ని జట్ల కంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టే అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుందట. ఈ జట్టు తర్వాతి స్థానంలో ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నిలిచాయి. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా.. ఫేస్‌బుక్‌లో మహేంద్ర సింగ్ ధోనికి అగ్రస్థానం లభించడం గమనార్హం. ఆయన తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లీ, క్రిస్‌ గేల్‌, రోహిత్‌ శర్మ, సురేశ్ రైనా చోటు దక్కించుకున్నారు. 

అలాగే లవ్డ్ రియాక్షన్స్ వచ్చిన హ్యాష్ ట్యాగ్స్‌‌లో ఎక్కువ శాతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ గీతమైన ‘విజిల్ పోడు’ కు వచ్చాయట.అలాగే ఐపీఎల్‌కి సంబంధించిన పోస్టులలో ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ బెంగాలీలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన పోస్టు ఎక్కువ ఆదరణ పొందింది.

అలాగే అత్యధిక ఆదరణ పొందిన ఐపీఎల్ వీడియోలలో  మైదానంలో ధోనీ తన కూతురు జీవాతో ఆడుకుంటూ ఉన్న వీడియో అభిమానులకు తెగ నచ్చేసిందట. అలాగే లైవ్ వీడియోలలో వీరేంద్ర సెహ్వాగ్‌ అభిమానులను ఫూల్స్‌ చేస్తూ తాను ఐపీఎల్‌లో ఆడుతున్నట్లు చెప్పిన వీడియో ఎక్కువగా వైరల్ అయ్యింది. 

Trending News