Jaanu Teaser : జాను టీజర్ రివ్యూ... జాను, రామ్ మళ్లీ కలిశారా ?

నాలుగంటే నాలుగు డైలాగులతో ఆడియెన్స్‌ లెక్కలేనన్ని ఎమోషన్స్‌కి గురయ్యేలా మేకర్స్ ఈ టీజర్‌ను డిజైన్ చేసిన తీరు ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. పీకల్లోతు ప్రేమలో పడిన తర్వాత విడిపోయిన రామ్-జాను మళ్లీ కలిశారా ? కలిస్తే ఎలా కలిశారు ? ఎక్కడ కలిశారు ? అసలు ఈ ప్రేమ కథా చిత్రంలో ఇంకెన్ని మలుపులున్నాయని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెంచేలా జాను మూవీ టీజర్ ఉంది.

Last Updated : Jan 9, 2020, 07:36 PM IST
Jaanu Teaser : జాను టీజర్ రివ్యూ... జాను, రామ్ మళ్లీ కలిశారా ?

శర్వానంద్, అక్కినేని సమంత జంటగా నటిస్తున్న అప్‌కమింగ్ లవ్ స్టోరీ మూవీ 'జాను' టీజర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. పడిపడి లేచే మనసు, రణరంగం వంటి చిత్రాల తర్వాత శర్వానంద్ నటిస్తున్న సినిమా ఇదే కాగా.. ఓ బేబీ మూవీ తర్వాత అక్కినేని సమంత నటిస్తున్న సినిమా కూడా ఇదే. తమిళంలో వచ్చిన 96 అనే మూవీకి తెలుగు రీమేక్ వెర్షన్‌ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు సి ప్రేమ్ కుమార్‌ చేతుల్లోనే తెలుగు రీమేక్‌ని కూడా పెట్టాడు. మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై ఎస్ నందగోపాల్ నిర్మించిన 96 సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తమిళంలో హిట్ అయిన 96 మూవీని తెలుగు నేటివిటికి అనుగుణంగా దిల్ రాజు జాను సినిమాను తెరకెక్కించడంలో పలు మార్పుచేర్పులు చేయించాడు. తెలుగు సినిమా ఆడియెన్స్ పల్స్ ఏంటో దిల్ రాజుకు బాగా తెలుసనే విషయం ఆ చిత్రాలను చూసే ఆడియెన్స్ అందరికీ తెలిసిన సంగతే. యవ్వనం తొలినాళ్లలోనే ప్రేమలో పడిన ఓ జంట... కొన్ని క్లిష్టపరిస్థితుల కారణంగా వేరవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే జాను సినిమా కథాంశం అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

నాలుగంటే నాలుగు డైలాగులతో ఆడియెన్స్‌ లెక్కలేనన్ని ఎమోషన్స్‌కి గురయ్యేలా మేకర్స్ ఈ టీజర్‌ను డిజైన్ చేసిన తీరు ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. పీకల్లోతు ప్రేమలో పడిన తర్వాత విడిపోయిన రామ్-జాను మళ్లీ కలిశారా ? కలిస్తే ఎలా కలిశారు ? ఎక్కడ కలిశారు ? అసలు ఈ ప్రేమ కథా చిత్రంలో ఇంకెన్ని మలుపులున్నాయని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెంచేలా జాను మూవీ టీజర్ ఉంది. పడిపడి లేచే మనసు, అంతకంటే ముందు వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాల్లోని శర్వానంద్‌ను, మజిలి సినిమాలో సమంతను మళ్లీ గుర్తుతెచ్చేలా జాను టీజర్ ఉంది. ఏదేమైనా టీజర్‌తోనే అంచనాలు పెంచడంలో జాను మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News