ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేసిన చరణ్ ఫ్యామిలీ

టాలీవుడ్ యువ స్టార్ హీరోలు ఈ మధ్య సఖ్యతగా ఉంటూ మిగిలినవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Last Updated : May 6, 2018, 08:11 AM IST
ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేసిన చరణ్ ఫ్యామిలీ

టాలీవుడ్ యువ స్టార్ హీరోలు ఈ మధ్య సఖ్యతగా ఉంటూ మిగిలినవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్‌కి మరొకరు, ఒకరి పార్టీకి మరొకరు ఇలా హీరోల మధ్య మంచి వాతావరణమే నడుస్తోంది. అయితే తాజాగా నెట్‌లో హల్చల్ చేస్తున్న  ఓ ఫోటోని చూడటానికి రెండు కళ్లు చాలవేమో..!
 
తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎన్టీఆర్, ప్రణీతల వెడ్డింగ్ యానివర్శరీని సెలబ్రేట్ చేశారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ తనయుడు అభ‌య్‌ ఉపాసన ఒడిలో కూర్చొని ఉండటం, చరణ్ ‌భుజంపై ఎన్టీఆర్ చేయి వేసి నిలబడటం వంటి దృశ్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఇక ఉపాస‌న కొద్ది సేపు అభ‌య్‌తో ఆట‌లాడింది. నాన్నకు ప్రేమ‌తో చిత్రంలోని ఫాలోఫాలో యూ సాంగ్‌ని అభ‌య్ చేత పాడించి ఆ వీడియోని త‌న ట్విట్టర్‌లో షేర్ చేసింది.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అద్భుతం అంటూ ఒకరు, ఈ పిక్ ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవడం లేదని మరొకరు, మెగా-నందమూరి కుటుంబాల మధ్య అనుబంధానికి నిదర్శనం అంటూ  అభిమానులు వారికి తోచిన కామెంట్లు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.  త్వర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్కనున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

Trending News