ఆ జోన్లలో మద్యం అమ్మకాలు షురూ..

దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆంక్షల సడలింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలకు మినహాయింపులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.

Last Updated : May 3, 2020, 11:14 PM IST
ఆ జోన్లలో మద్యం అమ్మకాలు షురూ..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆంక్షల సడలింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలకు మినహాయింపులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. ప్రధానంగా ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, గోవా, అసోం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు మూసి ఉన్న మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించాలని నిర్ణయించాయి. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాటలోనే మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతించే అవకాశం ఉంది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. 

Also Read:  బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

మరోవైపు అన్నీ రాష్ట్రాల కంటే ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలోకి రాని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించాలని,  దీంతో 400కు పైగా మద్యం దుకాణాలు సోమవారం నుండి తెరుచుకోనున్నాయని అధికారికంగా తెలిపారు. అయితే షాపింగ్ సముదాయాల వద్ద ఉండే మద్యం దుకాణాలను మాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం నగరంలో 545 లిక్కర్ షాపులున్నాయి. వీటిలో కొన్ని మాల్స్‌లో, మరికొన్ని కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నాయి. కొన్ని షరతులతో మద్యం షాపులు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఎక్సైజ్ శాఖను నగరంలో విడివిడిగా ఉన్న మద్యం షాపుల వివరాలను కోరింది. 

అయితే ఢిల్లీలోని 11 జిల్లాలు కూడా రెడ్‌జోన్‌లో ఉండగా, 96 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. అయితే కేంద్ర హోం శాఖ పేర్కొన్నట్లుగా భౌతిక దూరంతో పాటుగా జనం పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూడడం లాంటి నిబంధనలు కట్టుదిట్టంగా అమలయ్యేట్లు చూడాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే మద్యం దుకాణాలను కొన్ని షరతులు పాటిస్తూ తెరవడానికి అనుమతి ఇవ్వగా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెడ్ జోన్లలో కూడా మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News