హైదరాబాద్: కరోనా వ్యాప్తి కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు చాలా కష్టపడుతున్నారని, పోలీసుల వల్లే ప్రభుత్వం విధించినా లాక్ డౌన్ విజయవంతమవుతోందంటూ ప్రముఖ నటుడు చిరంజీవి చేసిన ట్వీట్ పై తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించారని, మీ స్ఫూర్తిని పొంది ఎన్ని రకాల శాఖలకు చెందిన వారిని ఉత్తేజపర్చారని డీజీపీ అన్నారు. కరోనాపై పోరాటంలో తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని, మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తుందని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో పేర్కొంటూ హైదరాబాద్లో ఉండి స్వయంగా చూశానని, పోలీసుల పనితీరు వల్లే లాక్డౌన్ విజయవంతమవుతుందని దీని వల్లే కరోనా విజృంభణ చాలా వరకు అదుపులో వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కరోనా మహమ్మారిని వ్యాప్తిని నివారించడం కోసం పోలీసులకు సహకరించాలని, పోలీసు శాఖ చేస్తున్న ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
#SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020
కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో వైద్యులు, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు ఎంతగానో కృషి చేస్తున్నారని, పోలీసు శాఖ రోడ్లపై ఉండి ప్రజలు సామాజిక దూరం పాటించేలా, సమూహాలుగా తిరగకుండా ఉండేలా పలు చర్యలు తీసుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను అభినందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..