4X4 SUV Cars : 4X4 SUV సెగ్మెంట్‌లో తక్కువ ధరలో లభించే కారు

4X4 SUV Cars Prices : మహింద్రా థార్ సెకండ్ జనరేషన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో.. అప్పటి నుంచే ఈ ఎస్‌యూవీ కారుకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. మహింద్రా థార్ కారుకి ఉన్న డిమాండ్ చూసిన ఆటోమొబైల్ కంపెనీలు.. 4x4 SUV కార్ల సెగ్మెంట్‌లో మహింద్రా థార్‌కి పోటీగా తమ సంస్థల నుంచి కూడా ఇదే 4X4 SUV సెగ్మెంట్‌లో కార్లను లాంచ్ చేస్తూ వచ్చాయి.

Written by - Pavan | Last Updated : Jun 20, 2023, 03:50 PM IST
4X4 SUV Cars : 4X4 SUV సెగ్మెంట్‌లో తక్కువ ధరలో లభించే కారు

4X4 SUV Cars Prices : మహింద్రా థార్ సెకండ్ జనరేషన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో.. అప్పటి నుంచే ఈ ఎస్‌యూవీ కారుకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. మహింద్రా థార్ కారుకి ఉన్న డిమాండ్ చూసిన ఆటోమొబైల్ కంపెనీలు.. 4x4 SUV కార్ల సెగ్మెంట్‌లో మహింద్రా థార్‌కి పోటీగా తమ సంస్థల నుంచి కూడా ఇదే 4X4 SUV సెగ్మెంట్‌లో కార్లను లాంచ్ చేస్తూ వచ్చాయి. అలా మహింద్రా థార్ తరువాత మార్కెట్లోకి వచ్చినవే ఫోర్స్ గుర్ఖాతో పాటు ఇటీవలే లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ వంటి వాహనాలు ఉన్నాయి. అయితే, ఒకవేళ మీ బడ్జెట్ మరీ టైట్ గా ఉన్నట్టయితే.. లో బడ్జెట్ లోనూ 4X4 SUV సెగ్మెంట్‌లో ఆకట్టుకునే కార్లు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

4X4 SUV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి జిమ్నీ జెటా ఎంటీ వేరియంట్ ఈ సెగ్మెంట్లో చౌకయిన కారు. ఈ కారు ఎక్స్ షోరూం ఖరీదు రూ. 13.74 లక్షలుగా ఉంది. 1.5L NA పెట్రోల్ ఇంజన్, 134 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ ఎంటీ, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సిస్టంతో రూపొందిన ఈ కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 

మహింద్రా థార్ AX(O) పెట్రోల్  
4x4 డ్రైవ్‌ట్రైన్‌తో మహీంద్రా థార్ యొక్క అత్యంత సరసమైన ట్రిమ్ AX(O) పెట్రోల్, దీని ధర రూ. 13.87 లక్షలు, ఎక్స్-షోరూమ్. 3-వరుసల ఆఫ్‌రోడర్ శక్తివంతమైన 2.0L టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 300 Nm గరిష్ట టార్క్‌కు వ్యతిరేకంగా 150 PS శక్తిని అందిస్తుంది. అవును, AX(O) ట్రిమ్ 2.2L ఆయిల్ బర్నర్‌తో కూడా అందుబాటులో ఉంది, దీని ధర రూ. 14.49 లక్షలు. థార్ AX(O) ఏ విధమైన ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కోల్పోతుంది.

ఫోర్స్ గూర్ఖా
ఫోర్స్ గూర్ఖా ఒకే ఒక్క వేరియంట్‌లో లాంచ్ అయింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.75 లక్షలుగా ఉంది. 2.6L 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో రూపొందిన ఈ ఫోర్స్ గూర్ఖా కారు గరిష్టంగా 91 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV కారుకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. 

మారుతి సుజుకి గ్రాండ్ విటారా - ఆల్ఫా ఆల్‌గ్రిప్
ఆల్‌గ్రిప్ AWD సిస్టమ్‌తో, మారుతి సుజుకి గ్రాండ్ వితారా కారు ఆల్ఫా వేరియంట్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.91 లక్షలుగా ఉంది. ముందుగా చెప్పుకున్నట్టుగా మారుతి సుజుకి గ్రాండ్ వితారా ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి : Smartphones Under Rs 20K: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ 

మహీంద్రా స్కార్పియో-N - Z4 E
మహీంద్రా స్కార్పియో-N 4x4, 4x2 కాన్ఫిగరేషన్‌లతో అమ్మకానికి రెడీగా ఉంది. 4x4 సెటప్ ఎంపిక చేసిన కొన్ని వేరియంట్‌లలో అందించడం జరుగుతుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 17.69 లక్షలుగా ఉంది. SUV 2.2L 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. అంతేకాకుండా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని కూడా అమర్చారు. అంటే మహీంద్రా స్కార్పియో-N కారు వేగంలో రాజీపడే ప్రసక్తే లేదన్నమాట. 

ఇది కూడా చదవండి : Hyundai Venue: హ్యుండయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్, ఈ మూడు ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

ఇది కూడా చదవండి : Redmi 12: రూ.15 వేల లోపే రెడ్ మీ 12.. 50 MP ట్రిపుల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News