Saranga Dariya: ప్రతి ఇంట్లో జరిగే కథ 'సారంగదరియా'.. మంచి సందేశం ఇచ్చే మూవీ: నవీన్ చంద్ర

Saranga Dariya Movie Pre Release Event: జూలై 12న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది సారంగదరియా మూవీ. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నటుడు నవీన్ చంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2024, 05:06 PM IST
Saranga Dariya: ప్రతి ఇంట్లో జరిగే కథ 'సారంగదరియా'.. మంచి సందేశం ఇచ్చే మూవీ: నవీన్ చంద్ర

Saranga Dariya Movie Pre Release Event: రాజారవీంద్ర ప్రధాన పాత్రలో సరికొత్త కాన్సెప్ట్‌తో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమా.. ఈ నెల 12న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే హీరో నిఖిల్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్‌ను అలరించింది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. చీఫ్‌ గెస్ట్‌గా హీరో నవీన్ చంద్ర హాజరై.. బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. 

Also Read: Heavy Rains Alert: తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్‌లోనూ వర్షాలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సారంగదరియా సినిమాను జూలై 12న అందరూ థియేటర్ల‌కు వెళ్లి చూడాలని కోరారు. రాజా రవీంద్ర తనకు ఫ్యామిలీ వంటి వారని.. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ తమలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారని అన్నారు. ఆయన ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారని.. ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపించిందన్నారు. మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ మూవీ తీశారని అర్థమవుతోందన్నారు. 

న‌టుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ఫెయిల్యూర్ అనేది చాలా డేంజర్ అని డైరెక్టర్ ట్రైలర్‌లోనే చెప్పేశారని అన్నారు. ఈ సినిమాలో తనకు ముగ్గురు కొడుకులు ఉంటారని.. ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుందన్నారు. తాను కాలేజీ లెక్ఛరరగా అందరికీ నీతులు చెబుతుంటానని.. కానీ తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేపోతానన చెప్పారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగా ఉండడల లేదని.. కలిసి కూర్చుని మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ చేస్తే.. కచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు. జూలై 12న తమ సినిమా ప్రేక్షకులు థియేటర్లలో చూడాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోందని.. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని కోరారు. 

డైరెక్టర్ పండు మాట్లాడుతూ.. తాను ఈ స్టోరిని చెప్పిన వెంటనే సాయిజా ప్రొడక్షన్స్ అధినేత శరత్ వెంటనే ఒప్పుకున్నారని.. సమానత్వం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు వెల్లడించారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందన్నారు. ఫాదర్ రోల్‌ను రాజా రవీంద్ర చక్కగా పోషించారని.. ఆయన వల్లే తాను ఇక్కడి వరకు వచ్చానని అన్నారు. నిర్మాత శరత్ చంద్ర చ‌ల్ల‌ప‌ల్లి మాట్లాడుతూ.. దర్శకుడు పండు వచ్చాకే ఈ సినిమా టీమ్ ఫామ్ అయిందని.. ఈ చిత్రానికి మహేష్ చాలా కష్టపడ్డాడని మెచ్చుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎపి చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారని అన్నారు.

Also Read: HIV Infections: హెచ్ఐవీ విధ్వంసం.. 828 కి  పాజిటివ్, 47 మంది మృతి.. ఎక్కడో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News