రిలయన్స్ జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్

రిలయన్స్ జియో ప్రి పెయిడ్ కస్టమర్లకు మరో శుభవార్త

Updated: Jun 1, 2018, 12:52 AM IST
రిలయన్స్ జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్
source: RJio

భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ ప్రి పెయిడ్ కస్టమర్లకు మరో శుభవార్తను వినిపించింది. జియో ప్రి పెయిడ్ టారిఫ్‌లలో ముఖ్యమైనదిగా పేరొందిన రూ.399 ప్లాన్‌పై రూ.100 డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే రూ.399ల రీచార్జ్‌ ప్లాన్‌ రూ. 100 డిస్కౌంట్‌ అనంతరం రూ.299లకే లభ్యం కానుందన్న మాట. అయితే, ఈ ఆఫర్ అపరిమితం కాకుండా లిమిటెట్‌ పీరియడ్‌ ఆఫర్‌ అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా జియో స్పష్టం చేసింది. జియో ప్రకటించిన వివరాల ప్రకారం జూన్‌ 1 నుంచి 15 తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తించనుంది.

ఈ ఆఫర్ కింద రీచార్జ్ చేయించుకున్న ప్రీ పెయిడ్ కస్టమర్లకు 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 126 జీబీ డేటా లభించనుంది. ఈ రూ.100 డిస్కౌంట్ ఆఫర్ ప్రకారం మై జియో యాప్‌‌లోని ఫోన్‌పే ద్వారా రీచార్జ్‌ చేసుకున్నట్టయితే రూ.50 క్యాష్‌ బ్యాక్‌ వోచర్‌, రూ.50 రీచార్జ్‌ కూపన్‌ లభించనుంది.