రానా, మిహికాలకు కొన్నేళ్ల కిందటే పరిచయం: సురేష్ బాబు

నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ ఇంటివాడయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి (Rana Daggubati Marriage) వంతు వచ్చింది. దగ్గుబాటి వారింటి పెళ్లి బాజాలు ఈ ఏడాది చివరిలోపే మోగనున్నాయని తెలుస్తోంది

Last Updated : May 13, 2020, 03:09 PM IST
రానా, మిహికాలకు కొన్నేళ్ల కిందటే పరిచయం: సురేష్ బాబు

టాలీవుడ్‌లో ఈ ఏడాది వరుస పెళ్లి బాజాలు మోగనున్నాయి. రేపు హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన ప్రేయసిని వివాహం చేసుకోనున్నాడు. నితిన్ నిశ్చితార్థం చేసుకోగా, లాక్‌డౌన్ వల్ల వివాహం వాయిదా పడింది. నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ ఇంటివాడయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి వంతు వచ్చింది. దగ్గుబాటి వారింటి పెళ్లి బాజాలు ఈ ఏడాది చివరిలోపే మోగనున్నాయని తెలుస్తోంది. రానా దగ్గుబాటి లవర్ ఫొటోలు చూశారా!

తన ప్రేయసి, వ్యాపారవేత్త మిహికా బజాజ్ తన ప్రేమను అంగీకరించిందని భళ్లాలదేవుడు రానా తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో మిహికాతో కలిసి దిగిన ఫొటోను సైతం సంతోషంగా షేర్ చేశాడు. రానా పెళ్లి ఎప్పుడన్న విషయంపై ఆయన తండ్రి, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. ఈ ఏడాదిలోనే కచ్చితంగా రానా పెళ్లి వేడుక జరపనున్నట్లు బాంబే టైమ్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లాక్‌డౌన్‌లో పెళ్లి పనులు చక్కబెడతామని చెప్పారు. Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

‘లాక్‌డౌన్ లాంటి సమయంలో మా కుటుంబానికి ఇది శుభవార్త. అందరం హ్యాపీగా ఉన్నాం. రానా, మిహికాలకు చాలాకాలం నుంచి పరిచయం ఉంది. మేం పెళ్లి పనులపై ఇప్పటినుంచే కసరత్తు చేయాలి. ఈ డిసెంబర్‌లోగా పెళ్లి జరిపిస్తాం. అయితే పెళ్లి తేదీ, ముహూర్తం లాంటివి ఇంకా మాట్లాడుకోలేదు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని’ ఆ ఇంటర్వ్యూలో నిర్మాత సురేష్ బాబు వివరించారు. రానా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు, నేపథ్యం వివరాలు..  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News