అభిమాని ప్రేమలేఖకు సుస్మితా సేన్ ఫిదా..

చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(Sushmita Sen) ఇటీవలే ఆర్య అనే వెబ్ సిరీస్ తో మళ్లీ నటనా రంగం వైపు అడుగులేసింది. తన ఆరాధ్య దేవత మళ్లీ నటిస్తుండడంతో ఓ అభిమాని ప్రేమలేఖ రాశాడు.

Updated: Jun 29, 2020, 12:29 AM IST
అభిమాని ప్రేమలేఖకు సుస్మితా సేన్ ఫిదా..

హైదరాబాద్: చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(Sushmita Sen) ఇటీవలే ఆర్య అనే వెబ్ సిరీస్ తో మళ్లీ నటనా రంగం వైపు అడుగులేసింది. తన ఆరాధ్య దేవత మళ్లీ నటిస్తుండడంతో ఓ అభిమాని ప్రేమలేఖ(Fan Love Letter To Sushmita Sen) రాశాడు. ఈ లేఖ పట్ల సుస్మితాసేన్ ఎంతో ముగ్ధురాలైంది. అంతేకాదు, ఆ లేఖను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఇదో అద్భుతమైన లవ్ లెటర్ అంటూ మురిసిపోయింది. అభిమానుల నుంచి ఇంతటి ప్రేమానురాగాలు పొందడం అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించింది.  ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 12 మంది మృతి

Also Read: Mann Ki Baatలో చైనాకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఏదేమైనా చేతిరాతతో రాసిన ప్రేమలేఖలు అంటే తనకు ఎంతో ఇష్టమని, తనకు వచ్చే ప్రతి లేఖను తాను చదువుతానని స్పష్టం చేసింది. తాజాగా వచ్చిన ప్రేమలేఖ ఎంతో సాధారణంగా ఉన్నా, ఎంతో ప్రేమను భావోద్వేగాల కలబోతగా అక్షరబద్ధం చేయడం తనకు ఎంతో నచ్చిందని, దీన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని సుస్మిత తెలిపింది. అంతేకాదు,లేఖ రాసిన అభిమాని నిజంగానే పరవశించిపోయేలా ఐ లవ్యూ టూ అంటూ సుస్మితా సేన్ (Sushmita Sen) స్వీట్ రిప్లై కూడా ఇచ్చింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ