Tollywood celebrities Jr NTR Venkatesh Bhogi Wishes: తెలుగువారికి టాలీవుడ్ సెలబ్రిటీల భోగి శుభాకాంక్షలు

Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం. 

Updated: Jan 14, 2020, 11:44 AM IST
Tollywood celebrities Jr NTR Venkatesh Bhogi Wishes: తెలుగువారికి టాలీవుడ్ సెలబ్రిటీల భోగి శుభాకాంక్షలు
Image Courtesy: Twitter/@IAmVarunTej/@VenkateshDaggubati

తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగలలో ఒకటి సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం. భోగ భాగ్యములను అందించేది భోగి అని అర్థం. నిన్నటి నుంచే భోగి పండుగ సందర్బంగా భోగి మంటలు వేసి సరికొత్త రోజుకు శ్రీకారం చూడతాం. దక్షిణాయన సమయంలో సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి చలి పెరుగుతుంది.

ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి మంటలు వేసి వెచ్చదనాన్ని పొందుతాం. తమలోని చలితో పాడు చెడు పోయి అంతా మంచి జరగాలని వేసే ఈ మంటల్ని భోగి మంటలు అంటారు. భోగి పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ సినీ సెల‌బ్రిటీలు త‌మ అభిమానుల‌కి భోగితో పాటు సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. విక్టరీ వెంకటేష్, జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, డైరెక్టర్లు అనిల్ రావిపూడి, సంపత్ నందితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

Also read: తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

ఎన్టీఆర్ ట్వీట్

వెంకటేష్ ట్వీట్

 

అనిల్ రావిపూడి

 

సంపత్ నంది

 

నందమూరి కల్యాణ్ రామ్

వరుణ్ తేజ్

శ్రేయాస్ గ్రూప్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..