తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , సీఎం కేసీఆర్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే సంక్రాంతి పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు.  

Updated: Jan 13, 2020, 09:52 PM IST
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే సంక్రాంతి పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు.

ప్రాచీన సంస్కృతికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. అందరిలోను ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం కనబడాలని వారు ఆకాంక్షించారు. ప్రజలు జీవితంలో ప్రతినిత్యం ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం కలగాలని  భగవంతుడిని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..