విజయ్ దేవరకొండ తమ్ముడు టాలీవుడ్ ఎంట్రీ ..హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు !!

                                     

Updated: Sep 28, 2018, 12:13 PM IST
విజయ్ దేవరకొండ తమ్ముడు టాలీవుడ్ ఎంట్రీ ..హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు !!

అతని తక్కువ కాలంలోనే లక్షల మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ నుంచి మరోకరిని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడట. సినిమాల విషయంలో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఆసక్తి చూపుతున్ననేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు విజయ్. అయితే ఈ మూవీకి సంబంధించిన మహుర్తం కూడా ఫిక్స్ చేశాడు. తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం కానున్న సినిమా అక్టోబర్‌ 10న షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.

హీరోయిన్ గా రాజశేఖర్ కుమార్తె 

సక్సెస్ ఫుల్ షార్ట్‌ ఫిలింస్‌ తీసి తానేంటో నిరూపించుకున్న కేవీఆర్‌ మహేంద్ర తొలి సారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్. అలాగే యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ లు దీనికి నిర్మాతలుగా వ్యహరిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సినిమా హీరోయిన్ విషయం వచ్చేసరికి  హీరో రాజశేఖర్‌ - జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌ గా పరిచయం కానందని టాలీవుట్ టాక్ వినిపిస్తోంది.

'అర్జున్‌ రెడ్డి'తో రాత్రికి రాత్రే టాలీవుడ్ స్టార్‌ గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ 'పెళ్లి చూపులు',  'గీత గోవిందం' సినిమాలతో ప్రేక్షకులను మొప్పించి స్థార్ స్టేటస్ సాధించిన విజయ్ దేవరకొండ తన తమ్ముడిని తెరంగేట్రం చేయించేందుకు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.