టాక్సీవాలాపై దారుణమైన కామెంట్స్.. తనదైన స్టైల్లో స్పందించిన విజయ్ దేవరకొండ

టాక్సీవాలాపై దారుణమైన కామెంట్స్.. తనదైన స్టైల్లో స్పందించిన విజయ్ దేవరకొండ  

Last Updated : Nov 9, 2018, 07:04 PM IST
టాక్సీవాలాపై దారుణమైన కామెంట్స్.. తనదైన స్టైల్లో స్పందించిన విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన విజయ్ దేవరకొండ ఇటీవల నోటా సినిమాతో కాస్త డీలా పడ్డాడు. అయితేనేం... వెంటనే తన తర్వాతి సినిమా 'టాక్సీవాలా'ను రోడ్డెక్కించి వెంటనే థియేటర్లలోకి తీసుకొచ్చే పనిలో మళ్లీ బిజీ అయ్యాడు. వాస్తవానికి టాక్సీవాలా సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే, కారణాలు ఏవైనా ఆ సినిమా కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో టాక్సీవాలా సినిమాపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అసలు ఈ సినిమా ఇంకా థియేటర్లలోకే రాకముందే.. సినిమా యావరేజ్‌గా ఉందని అప్పుడే జడ్జ్‌మెంట్స్ కూడా ఇచ్చేశారు కొంతమంది. దీంతో ఈ పుకార్లపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు నటుడు విజయ్ దేవరకొండ. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు ఇంకా చేయాల్సిన పని ఎంతో ఉందని, థియేటర్లలోకే రాని ఈ సినిమాను యావరేజ్ అని ఎలా తేలుస్తారని విజయ్ దేవరకొండ ప్రశ్నిస్తున్నాడు. ది రియాలిటీ బిహైండ్ టాక్సీవాలా అనే పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రూపొందించిన ఓ వీడియో ద్వారా విజయ్ దేవరకొండ తన విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. నవంబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్ కి ఉన్న సందేహాలను నివృత్తి చేసింది ఈ వీడియో.

 

Trending News