Thyroid: ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వచ్చిందా.. ఇలా చేస్తే తల్లి, బిడ్డ సేఫ్!

Thyroid During Pregnancy: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా థైరాయిడ్‌ వంటి భయంకరమైన వ్యాధి బారిన వయసుతో సంబంధం లేకుండా బాధపడుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ సమస్య తలెత్తితే ఎలా కంట్రోల్‌ చేయాలి అనే ప్రశ్న ప్రతిఒక్కరిని కలుగుతుంది. ఆరోగ్యనిపుణులు కొన్ని సూచనలు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 12:15 PM IST
Thyroid: ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వచ్చిందా.. ఇలా చేస్తే తల్లి, బిడ్డ సేఫ్!

Thyroid During Pregnancy:  మనం తీసుకునే ఆహారం శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రస్తుత కాలంలో పోషక ఆహారం కన్నా మార్కెట్‌లో లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. జంక్‌ ఫూడ్, ప్యాకేజ్డ్ ఫుడ్‌లను తినడాకి ఇష్టపడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల భయంకరమైన థైరాయిడ్‌ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ఒకసారి మొదలవుతే జీవితాంతం మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. 

చాలా మందికి థైరాయిడ్‌ సమస్య మీద     అవగాహన ఉండదు. ఈ వ్యాధి కరణంగా బరువు తగ్గుతారు, హార్మోన్లు కూడా మారుతుంటాయి. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల కూడా కలుగుతాయి. కొందరిలో ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ సమస్య కలుగుతుంది. ఈ వ్యాధి వల్ల కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. 

ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలి: 

ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకొనే ఆహారం బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. పోషక ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరి తీసుకోవాలి. థైరాయిడ్‌ను అదుపులో ఉంచే ఆ కూరగాయలను తీసుకోవాలి. హైపోథైరాయిడిజం సమస్యను ఎదుర్కొంటున్న స్త్రీ అయోడిన్, తృణధాన్యాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

శరీరానికి యోగా: 

యోగా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైన సులువుగా మాయం అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులకు యోగా ఎంతో మేలు. చెడు జీవనశైలి వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీని కోసం యోగా సాధన చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Also Read Beetroot: బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత!

రెగ్యులర్ చెకప్: 

ప్రెగ్నెన్సీ సమయంలో నెల నెల చెకప్‌ చేసుకోవడం చాలా అవసరం. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు తప్పకుండా రెగ్యులర్‌ చెకప్‌ చేసుకోవాలి. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యకు కారణం హార్మోన్ల అసమతుల్యత. కాబట్టి మీరు వైద్యులను కలవడం చాలా అవసరం.

ఒత్తిడి:

ఒత్తిడి కారణంగా కూడా థైరాయిడ్‌ సమస్య పెరిగే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.  ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ సమస్యలు మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన జీవనశైలిని అనుసరించడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. 

Also Read Cause Of Cancer: ఈ విటమిన్ల లోపం వల్ల క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News