Diabetes Best Remedy: డయాబెటిస్ ఎంతకీ తగ్గడం లేదా, ఈ గింజలతో మీ షుగర్ కంట్రోల్

Diabetes Best Remedy in Telugu: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ముప్పు తీవ్రమౌతోంది. దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం. ఇప్పటి వరకూ డయాబెటిస్‌కు సరైన మందు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ మధుమేహం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరి ఈ సమస్యకు సమాధానమేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2024, 07:46 PM IST
Diabetes Best Remedy: డయాబెటిస్ ఎంతకీ తగ్గడం లేదా, ఈ గింజలతో మీ షుగర్ కంట్రోల్

Diabetes Best Remedy in Telugu: దేశంలో మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిస్‌కు మందులతో నియంత్రణే తప్ప పూర్తి చికిత్స ఇంకా అందుబాటులో రాలేదు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మందుల అవసరం లేకుండానే డయాబెటిస్‌ను పూర్తిగా అదుపులో ఉంచవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం.

డయాబెటిస్‌కు చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం సాధ్యమే. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలతో అద్భుతంగా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవచ్చు. అదే సమయంలో డైట్ పూర్తిగా నియంత్రణలో ఉండాలి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, పైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెద్దఎత్తున ఉంటాయి. అందుకే వీటిని డైట్‌లో భాగంగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. ఇది అవసరం కూడా. ఎందుకంటే మధుమేహాన్ని నియంత్రించకుంటే కిడ్నీలు, కంటి చూపు, నరాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 

చియా సీడ్స్‌లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ కారణంగా ఆహారం తీసుకున్న తరువాత బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. దీనికితోడు ఇదే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చియా సీడ్స్‌లో ఫైబర్ పెద్దఎత్తున ఉండటంతో జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దూరమౌతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగుపడిందో సహజంగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో వస్తాయి. చియా సీడ్స్‌ను డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. చియా సీడ్స్‌ను పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. 

చియా సీడ్స్‌ను మజ్జిగ లేదా పాలలో నానబెట్టి ఉదయం తీసుకుంటే చాలా మంచిది. లేదా నీళ్లలో నానబెట్టి కొద్గిగా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. చియా సీడ్స్‌ను రోజు భోజనానికి అరగంట ముందు కూడా తీసుకోవచ్చు. చియా సీడ్స్‌ను ఏ రూపంలో అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు. 

మధుమేహం నియంత్రించేందుకు మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. మజ్జిగలో రెండు చెంచాల చియా సీడ్స్ నానబెట్టి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పాదకత కూడా పెరుగుతుంది. అయితే చియా సీడ్స్ తీసుకునేటప్పుడు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. 

Also read: Coconut Oil Benefits: రోజూ పరగడుపున కొబ్బరి నూనె తాగితే ఏమౌతుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News