కరోనా వైరస్ రక్షణకు కొత్త ఎయిర్ ఫిల్టర్, 97 శాతం రక్షణ అంటున్న హనీవెల్ కంపెనీ

Airfilter for Coronavirus: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. మరోవైపు కరోనా వైరస్ అంతానికి ఓ కంపెనీ కనిపెట్టిన ఫిల్టర్ ఇప్పుుడు చర్చనీయాంశమవుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 5, 2021, 09:20 PM IST
కరోనా వైరస్ రక్షణకు కొత్త ఎయిర్ ఫిల్టర్, 97 శాతం రక్షణ అంటున్న హనీవెల్ కంపెనీ

Airfilter for Coronavirus: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. మరోవైపు కరోనా వైరస్ అంతానికి ఓ కంపెనీ కనిపెట్టిన ఫిల్టర్ ఇప్పుుడు చర్చనీయాంశమవుతోంది.

కరోనా వైరస్ (Coronavirus)నియంత్రణకు ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతోంది. మరోవైపు కచ్చితమైన మందు కనిపెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కరోనా వైరస్ తరచూ మ్యూటేషన్ చెందుతూ కొత్త వేరియంట్లతో(New Variants)ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ప్రముఖ ఏసీ తయారీ సంస్థ హనీవెల్ ఇంటర్నేషనల్ తయారు చేసిన ఏసీ ఎయిర్ ఫిల్టర్ చర్చనీయాంశంగా మారింది. 

ఈ ఎయిర్ ఫిల్టర్ 97 శాతం వరకూ కరోనా వైరస్‌ను నాశనం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఎయిర్ ఫిల్టర్లకు(Airfilters) ప్రత్యేకమైన కోటింగ్ అమర్చడంతో ఇది సాధ్యమైందని హనీవెల్ కంపెనీ చెబుతోంది. ఏసీల ఎయిర్ ఫిల్టర్లకు పూసే రసాయన కోటింగ్‌కు పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కరోనా వైరస్ నిర్మూలనలో ఎయిర్ ఫిల్టర్లు 97 శాతం వరకూ ప్రభావవంతంగా పని చేస్తున్నాయని హనీవెల్ కంపెనీ పరిశోధనలో తేలింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటినుంచి హనీవెల్ కంపెనీ N95మాస్క్‌ల(N95 Masks) వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల్ని ఉత్పత్తి చేస్తోంది.

Also read: కరోనా నుంచి రక్షణకు వ్యాక్సిన్ బూస్టర్ డోసు అనివార్యమేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News