Vitamin D deficiency in COVID-19 patients: లండన్: కరోనావైరస్‌కి చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయో... మరోవైపు కరోనా సోకుతున్న (Coronavirus infection) వారిపైనా అందుకు గల కారణాలపై పరిశోధనలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్పెయిన్‌లో జరిగిన ఓ పరిశోధనలో కొవిడ్-19 సోకిన వారిలో 80 శాతం మంది విటమిన్ డి లోపంతో (Vitamin D deficiency) బాధపడుతున్నట్టు తేలింది.
యూనివర్శిటారియో మార్క్యూస్ వల్డెసిల్లా హాస్పిటల్‌లో 216 మంది కొవిడ్-19 పేషెంట్స్‌ని పరీక్షీంచగా వారిలో 80 శాతం మందికి విటమిన్-డి లోపం ఉన్నట్టు తెలిసింది. అందులోనూ మహిళలతో పోల్చుకుంటే మగవారిలో విటమిన్ డి లెవెల్స్ మరీ తక్కువగా ఉన్నట్టు పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటాబాలిజం జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు.
ఇదే విషయమై స్పెయిన్‌లోని శాంటండర్‌లో ఉన్న కాంటాబ్రియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జోస్ ఎల్ హెర్నాండెజ్ మాట్లాడుతూ.. '' డి విటమిన్ లోపంతో బాధపడే కొవిడ్-19 పేషెంట్స్‌కి (COVID-19 patients) విటమిన్ డి చికిత్సను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది'' అని అభిప్రాయపడ్డారు. ''మరీ ముఖ్యంగా కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపించే వృద్ధులు, ఇతర రోగులలో విటమిన్ డి లోపాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా వారికి చికిత్స చేపట్టినట్టయితే మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది'' అని హెర్నాండెజ్ తన పరిశోధనల్లో పేర్కొన్నారు.
Also read : Covid 19 symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ? ఎంత తక్కువ ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook