Dark chocolate Benefits: డార్క్ చాక్లెట్ మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపే పోషకాలతో నిండి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ కోకో సీడ్ నుండి తయారవుతాయి. ఇది యాంటీఆక్సిడెంట్ల ఉత్తమ వనరులలో ఒకటి. డార్క్ చాక్లెట్ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మీరు అధిక కోకో కంటెంట్‌తో ఉన్న నాణ్యమైన డార్క్ చాక్లెట్‌ను కొనుగోలు చేస్తే, అది చాలా పోషకాలను అందిస్తుంది. ఇది ఎక్కువ మొత్తంలో ఫైబర్, ఖనిజాలతో నిండి ఉంటుంది. 100 గ్రాముల డార్క్ చాక్లెట్ లో 11 గ్రా ఫైబర్, ఐరన్ 67%, మెగ్నీషియం 58%, రాగి 89%, మాంగనీస్ 98% ఉంటాయి. అయితే 100 గ్రాముల చాక్లెట్ లో 600 కేలరీలు ఉంటాయి. దీని వల్ల మితంగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె జబ్బులకు సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రమాద కారకాలు మెరుగుపడతాయి. కోకో పౌడర్ పురుషులలో ఆక్సిడైజ్డ్ LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. డార్క్ చాక్లెట్ లో తయారీలో కోకో వాడతారు. దాని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా గుండె జబ్బుల నుంచి రక్షణని ఇస్తుంది. దీని బట్టి చూసుకుంటే డార్క్ చాక్లెట్ శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందే తప్ప.. హానీ కలుగజేయదని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read: Summer Drinks: ఎండల కాలంలో ఈ ఆరోగ్యకరమైన నేచురల్ పానీయాలను ట్రై చేయండి!
Also Read: Henna for Hair: జుట్టుకు హెన్నా రాసుకునే వాళ్లు కచ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook