How To Control Diabetes: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. రోజురోజుకు విపరీతంగా మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవన శైలితో పాటు ఆహారాల్లో మార్పలు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..మధుమేహం కారణంగా చాలా మందిలో ప్రమాదం పెరుగుతోంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజువారి జీవితంలో మార్పులు చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ కింది విషయాల పట్ల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
మధుమేహంతో బాధపడుతున్నవారు ఇలా చేయోద్దు:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అల్పాహారంలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు గల అల్పాహారాలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలు రక్తంలో చక్కెర పరిమాణాలను వేగంగా పెంచుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా దారీ తీస్తుంది. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో బిస్కెట్లు, పాస్తా, స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, వైట్ రైస్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ అలవాట్లు చాలా ప్రమాదకరం:
మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు అధిక పరిమాణంలో పెరుగుతాయి. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీకడుపుతో ఉండడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారాల్లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
నిరంతరం కూర్చోవచ్చా?:
మధుమేహంతో బాధపడుతున్నవారు శారీరక శ్రమ చేయడం వల్ల చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆఫీసులో కంటిన్యూగా కూర్చునే అలవాటు ఉంటే తప్పకుండా 5 నిమిషాల పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. శారీరక శ్రమ చేయకపోతే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 31 శాతం పెంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook