Diabetes Control In 5 Days: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారని ఇటీవలే నివేదికలు పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ వ్యాధికి ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ముఖ్యంగా చాలా మంది రక్తంలో చక్కెర పరిమాణం పెరిగి ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆమ్లా టీ (ఉసిరితో చేసిన టీ) తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఉసిరిలో లభించే పోషకాలు ఇవే:
ఉసిరికాయలో శరీరానికి లభించే చాలా రకాల పోషకాలు ఉంటాయి. అయితే దీనిని ఆయుర్వేద శాస్త్రంలో సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఐరన్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
డయాబెటిస్ ఉన్నవారికి ఉసిరి ఎలా వినియోగపడుతుంది:
భారత్‌లో లభించే ఉసిరిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. కావున ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్లు రక్తంలో గ్లూకోజ్‌ను సులభంగా విడుదల చేసేందుకు కృషి చేస్తాయి. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ వ్యాధి గ్రస్తులకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గ్లూకోజ్ పదార్థాలు రక్తపోటును నియంత్రించడాని సహాయపడాతాయి.
వీరు ఈ టీని తప్పకుండా తీసుకోవాలి:
ఉసిరికాయ డయాబెటిక్ పేషెంట్స్‌కు దివ్యౌషధంగా పని చేస్తుంది. కావున వీటిని పచ్చిగా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది.
ఈ టీని ఎలా తయారు చేయాలి:
>>ముందుగా చాయ్ కాడలో 2 కప్పుల నీళ్లను తీసుకోవాలి.
>>ఇప్పుడు ఇందులో ఒక చెంచా ఉసిరి పొడి, అల్లం చూర్ణం వేయండి.
>>ఇప్పుడు తాజా పుదీనా ఆకులు వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి.
>>తర్వాత టీని ఫిల్టర్ చేసి కప్పులో సర్వ్ చేసి తీసుకోవాలి.
>> దీనిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook