Home Remedy For Diabetes: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది మధుమేహం సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా వీరు గుండె సమస్యలకు కూడా గురవుతున్నారు. అయితే ఈ సమస్యకు గురవడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి, ఆనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేనని నిపుణులు తెలుపుతున్నారు. ఈసమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో పలు రకాల మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మార్పులు తప్పకుండా చేసుకోండి:
<<శరీరంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉండడానికి జీవన శైలిలో పలు రకాల మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చక్కెర పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఒక వేళా అధికంగా చక్కెర పరిమాణాలున్న ఆహారాలను తీసుకుంటే తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయి.
<<మధుమేహం నియంత్రించుకోవడానికి తప్పకుండా ఉదయం పూట ప్రాణాయామం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి తప్పకుండా 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
<<ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలను కూడా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆహారాల్లో పిండి పదార్ధాల పరిమాణం అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది. వీటిని అతిగా తీసుకుంటే శరీరంలోని చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.
<<మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. తప్పకుండా వీరు ఆహార నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు.
<<ఆహారంలో బాగంగా పెరుగు, గింజలు, ఆకు కూరలు, చిక్కుళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిని నియంత్రిణలో ఉంటుంది.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook