Diabetic Patient Should Not Eat These Fruits: డయాబెటిస్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రమం తప్పకుండా పలు రకాల వ్యాయామాలు చేయడం వల్ల మంచి మధుమేహాం ఉన్నవారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలపుతున్నారు. అయితే వీరు మారుతున్న జీవన శైలికారణంగా సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ ఆహారంలో ఎక్కువ పరిమాణంలో పండ్లు తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా మంది ఈ పండ్లు తీసుకునే క్రమంలో తిన కూడని వాటిని కూడా తింటున్నారు. అయితే ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడి పండు:
భారతదేశ వ్యాప్తంగా మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి ఉంది. అయితే వీటిని ఎక్కువగా భారతీయులు వేసవి కాలంలో తింటూ ఉంటారు. వీటిల్లో అధిక పరిమాణంలో చక్కెర ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లను మధుమేహంతో బాధపడుతున్నవారు తినకూడాదని నిపుణులు తెలుపుతున్నారు. వీటిల్లో ఉండే మూలకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతాయి.
అరటిపండు:
అరటిపండులో శరీరాన్ని దృఢంగా చేసే చాలా రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి వైద్యుల తరచుగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే..ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
లీచీ పండ్లు:
బీహార్‌లో లీచీ పండ్ల వినియోగం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీటిని తినేందుకు ప్రస్తుతం చాలా మంది ఇష్టపడుతున్నారు. మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే..శరీరంలో చక్కెర పరిమాణం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.
పైనాపిల్:
పైనాపిల్స్‌లో అధిక పరిమాణాల్లో చక్కెర మూలకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుంటే మధుమేహం తీవ్రత పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. కాబట్టి వీరు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook