Diet Planning For Weight Loss: మనలో చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే చాలామందికి తెలియని విషయమేమంటే.. అధిక బరువు పెరగడం కారణంగా అనేక రకాల వ్యాధులు వస్తాయి. బరువు పెరగడం కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి గుండెపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా శరీర బరువు పెరుగుతున్న వారు నియంత్రించుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ కారణంగా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీని కారణంగా సులభంగా బరువు పెరిగి గుండెపోటు, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు.
కాబట్టి బరువు పెరుగుతున్న వారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు శరీర బరువు నియంత్రణ చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ముప్పని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా వ్యాయామాలు చేయని వారు శరీర బరువును తగ్గించుకోవడానికి.. తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని సూచనలు, సలహాలు పాటించడం చాలా మంచిది. వీటిని పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.
ప్రస్తుతం చాలామంది శరీరక శ్రమ లేకపోవడం కారణంగా కూడా సులభంగా బరువు పెరుగుతున్నారు. కాబట్టి బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా వ్యాయామాలతో పాటు యోగాసనాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇక ఆఫీసు పనుల్లో బిజీగా ఉండేవారు తప్పకుండా గంటకి ఒకసారైనా ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బరువు తగ్గడానికి ప్రతిరోజు వ్యాయామాలు చేసే క్రమంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా చాలామంది. అనారోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజూ తింటారు. ఇక బరువు తగ్గే వారి విషయానికొస్తే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతిరోజు ఆహారాలను డైట్ పద్ధతిలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే మంచి ఫలితాలు పొందుతారు.
శరీర బరువును నియంత్రించుకోవాలనుకునేవారు ఉదయం అల్పాహారంలో భాగంగా కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు శరీరానికి శక్తిని అందించే ప్రోటీన్ గల ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో ఎంత వీలైతే అంత కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..