Hug Benefits For Health: హగ్ ప్రేమతో ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం. హగ్ అనేది తల్లి బిడ్డలు, స్నేహితులు , భార్య భర్తలు, అన్నా చెల్లెలు, లవర్స్ ఇలా రిలేషన్షిప్ ను బట్టి హగ్ అనేది ఉంటుంది. హగ్ ఒక ఆప్యాయత, ప్రేమ, స్నేహం, భరోసా, మద్దతును వ్యక్తీకరించే ఒక శారీరక భాష. మనం హగ్ చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యుల పరిశోధనలో తేలింది. హగ్ చేసుకోవడం వల్ల చాలా వరకు రిలీఫ్ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే హగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం..
హెగ్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీ, లోన్లీనెస్, డిప్రెషన్ బ్లడ్ ప్రెజర్ వంటి సమస్య తగ్గుతాయి. హగ్ చేసుకోవడం వల్ల బాడీలో ఆక్సిటోసిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయి మనిషిని హ్యాపీగా ఉంచుతుందని కొన్ని పరిశోధనలో తేలింది. ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్, ఇది పిట్యుటరి గ్రంధిలో రిలీజ్ అవుతుందట.
ఒక డేలో 20 సెకండ్లు మ హగ్ చేసుకుంటే బాడీ ఇమ్యూనిటీ, హ్యూమన్ రిలేషన్ షిప్, బాండింగ్స్, అంతేకాకుండా హార్ట్ హెల్త్, మెంటల్ టెన్షన్ తగ్గి హ్యాపీగా నిద్రపోవచ్చనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హగ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటివి తగ్గుతాయి. అలాగే రక్తపోతును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోను ఈ హగ్ ఎంతో మేలు చేస్తుంది.
హగ్ ప్రేమ, స్నేహం, భరోసా, మద్దతును వ్యక్తీకరించడానికి ఒక మార్గం. అయితే హగ్ అనేది ఒక ఇరువై సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. హగ్ అనేది కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రియుడు , పెంపుడు జంతువులతో కూడా చేసుకోవచ్చు.
అయితే హగ్ చేసుకోడానికి ముందు మీరు వ్యక్తి యొక్క అనుమతిని తీసుకోవాలి. హగ్ చేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకోవాలి. అలాగే హగ్ చేసేటప్పుడు మీ శరీరాన్ని మరొక వ్యక్తి శరీరానికి దగ్గరగా తాకండి.హగ్ ఒక అద్భుతమైన శక్తివంతమైన భావోద్వేగ చికిత్స. ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీకు నచ్చిన వారిని హగ్ చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు అంటున్నారు.
Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter