Effective home remedies for Cold and Flu : దగ్గు, జలుబు చిటికెలో మాయం చేసేందుకు కొన్ని వంటింటి చిట్కాలు ఎంతో బాగా పని చేస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో జలుబు, (Cold) దగ్గులాంటి (cough) సమస్యల బారిన అందరూ పడుతుంటారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ సీజనల్‌పరంగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరి దగ్గు, జలుబు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా.. మందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇవి తగ్గాలంటే కొంత సమయం పడుతుంది. అలా అని పట్టించుకోకుండా వదిలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే దగ్గు, జలుబుతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం అయితే వీటిని బారిన పడితే కరోనా (Corona) సోకిందా అనే అనుమానం మరింత కలవరానికి గురి చేస్తోంది.
వంటింటి చిట్కాలతో మంచి వైద్యం
దగ్గు, జలుబు వచ్చిన వెంటనే కొన్ని రకాల వంటింటి చిట్కాలు పాటిస్తే చాలా మేలు. మంచి ఫలితం ఉంటుంది. వంటింటిలోని (Kitchen) కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టుకోవడం, గార్గిల్ చేయడం వంటి వాటి వల్ల వెంటనే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
Also Read : ఇంగ్లండ్ నడ్డి విరిచిన Jasprit Bumrah.. బుమ్రా ఖాతాలో మరో రికార్డ్
మిరియాలు... తేనే
ఒక టీస్పూన్ పసుపు, నల్లమిరియాలు, (Black pepper) తేనె (Honey) కలిపిన మిశ్రమం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు తులసి టీ తాగాలి. ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివీ మొదలైన పుల్లటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచింది. ఒక లీటరు నీటిలో ఏడు ఎనిమిది తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్ చొప్పున వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి మరిగించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.
ఈ సూచనలూ పాటించండి
స్నానం చేసేందుకు, తాగేందుకు చల్లటి నీరును ఉపయోగించకండి. జీర్ణక్రియ మెరుగయ్యేందుకు ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగండి. గొంతు సమస్యలుంటే తేనె మంచి ఉపశమనమిస్తుంది. కాబట్టి తేనేను తీసుకుంటూ ఉండండి. సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, (Ginger) పసుపు, (turmeric) లెమన్‌టీలు (lemontea) తాగితే చాలా మంచిది. గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే దగ్గు, జలుబు నుంచి వెంటనే బయటపడే అవకాశం ఉంటుంది. గొంతునొప్పి మరీ ఎక్కువగా వేధిస్తుంటే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్ చేయండి. తులసి ఆకులు నమలాలి. ఈ సూచనలు పాటిస్తే దగ్గు, (Cold) జలుబు నుంచి వీలైనంత వరకూ బయటపడొచ్చు.
Also Read : IND vs ENG: చెలరేగిన భారత బౌలర్లు...నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook