Copper Vessels: రాగి పాత్రలో ఇవి తాగితే ఇంకా అంతే సంగతి..

Copper disadvantages: రాగి పాత్రలో నీరు తాగడం చాలా ఆరోగ్యకరం. అలా అని రాగి పాత్రలో ఏమి తాగినా ఆరోగ్యకరం అని మాత్రం అనుకోకండి. ఈ పాత్రలో పానీయాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ముప్పులు ఉన్నాయి. మరి రాగి పాత్రలో తీసుకోకూడనవి ఏవి అనే విషయం ఒకసారి చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2023, 10:34 PM IST
Copper Vessels: రాగి పాత్రలో ఇవి తాగితే ఇంకా అంతే సంగతి..

Copper bottles: ప్రతి దానికి ఫలితాలు ఉంటాయి.. దుష్ఫలితాలు ఉంటాయి.. రాగి పాత్రకి కూడా అదే వర్తిస్తుంది. రాగి పాత్ర చాలా మంచిది అని మనం అనుకుంటాం. నిజంగానే రాగి పాత్రలోని నీతిని తాగడం ఆరోగ్యకరం. కానీ రాగి పాత్ర మంచిది కదా అని అందులో ఏదైనా పోసుకొని తాగేయొచ్చు అని మాత్రం అనుకోకండి. ఈ పాత్రలో తాగకూడని కొన్ని పానీయాలు, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి. మరి అవేవో ఒకసారి చూద్దాం

ఉదయాన్నే రాగి బాటిల్‍లో నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రాగి క్లాస్ లోని నీరు తాగడం వల్ల అది కడుపు, మూత్రపిండాలు, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. అందుకే చాలామంది రాత్రిపూట రాగి పాత్రలో నీళ్లు పోసి మూత పెట్టి తెల్లారి లేచిందే తాగుతూ ఉంటారు. మరికొంతమంది రాగిపాత్ర మంచిది కదా అని నీళ్లే కాదు దాంట్లో ఏమి తాగినా ఆరోగ్యానికి శ్రేయస్కరం అనే భ్రమలో ఉన్నారు. మీరు అదే భ్రమలో ఉంటే తప్పకుండా ఆ భ్రమ నుంచి బయటకు రండి.

రాగి పాత్రలో కొన్ని తాగడం వల్ల ఎన్నో ముప్పులు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మజ్జిగను రాగి పాత్రలో అసలు తీసుకోకూడదు. కాగా దీనికి కారణం లేకపోలేదు.. పెరుగులోని లక్షణాలు లోహంతో ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా ఇది మీ ఆరోగ్యని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇందువల్లనే రాగి ప్లేట్ లో పెరుగు అన్నం తినడం కూడా మంచిది కాదు. రాగి ప్లేట్ లో లో పెరుగన్నం తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

పెరుగు, మజ్జిగ కాకుండా ఇతర పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం హానికరం. పాలలోని ఖనిజాలు, విటమిన్లతో రాగి చర్యలు జరుపుతుంది. ఇందువల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీనివల్ల మీకు మోషన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువే.

పాల ఉత్పత్తుల విషయం పక్కన పెడితే రాగి పాత్రలో పచ్చళ్లు, మామిడికాయలు, సాస్‌లు, జామ్‌లు లాంటివి కూడా తినకూడదు. రాగి పాత్రలో అస్సలు నిల్వ చేయకూడదు. ఇవన్నీ కూడా రాగితో ప్రతిస్పందిస్తాయి. కాలక్రమేణా ఇవి మీలో బలహీనత, వికారం లేదా ఆందోళనకు కారణమవుతాయి. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకారం, 6.0 కంటే తక్కువ pH స్థాయిని కలిగి ఉన్న ఏ ఆహార పదార్థం కూడా రాగితో కలవకూడదు.
కాబట్టి ఈ విషయాలు అన్నీ గుర్తు పెట్టుకొని రాగి పాత్రను ఉపయోగించండి.

Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 

Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

Trending News