Guava Leaves Benefits In Telugu: జామపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి.. అందుకే చాలా మంది వీటిని క్రమం తప్పకుండా తింటూ ఉంటారు. నిజాని జామపండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయో.. వీటి ఆకుల్లో కూడా అలాంటి పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్‌తో పాటు విటమిన్ A ఎక్కువ మోతాదులో లభిస్తుంది. దీంతో పాటు ఈ ఆకుల్లో విటమిన్ C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్, మాంగనీస్ కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ ఆకులను ఉదయం పూట తినడం వల్ల బాడీకి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇవి మధుమేహం ఉన్నవారికి కూడా ఎంతో సహాయపడతాయి. అయితే వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
జామ ఆకుల లాభాలు:
షుగర్ నియంత్రణ:
జామ ఆకులు ప్రతి రోజు తినడం వల్ల మధుమేహం ఉన్నవారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
బరువు తగ్గడానికి:
జామ ఆకులు రోజు డైట్‌లో భాగంగా చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే చాలా మంది బరువు తగ్గే క్రమంలో జామతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. జీర్ణక్రియ కూడా ఎంతో శక్తివంతంగా తయారవుతుంది.
గుండె సమస్యలు:
జామ ఆకులు రోజు తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుంది. దీని కారణంగా అన్ని రకాల గుండె సమస్యలు దూరమవుతాయి. అలాగే గుండెపోటు పోటు రాకుండా ఉంటుంది.
జీర్ణ సమస్యలకు చెక్:
జామ ఆకులు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ శక్తివంతంగా తయారవుతుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
చర్మ ఆరోగ్యం:
జామ ఆకులు చర్మ సమస్యల తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. అలాగే కంటి సమస్యలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.