Hair Care Tips: మీ ఇంట్లో తయారు చేసే మ్యాజిక్ ఆయిల్‌తో కేశ సమస్యలన్నీ దూరం

Hair Care Tips: ఇటీవలి కాలంలో కేశాల సమస్య అధికంగా కన్పిస్తోంది. కేశాలు నిర్జీవంగా ఉండటం, తరచూ జుట్టు రాలడం వంటి సమస్యలతో ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్హందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌లో లభించే వివిధ ఉత్పత్తుల్ని వాడేకంటే హోమ్ రెమిడీస్ ఈ సమస్యకు అద్భుతంగా పరిష్కారం చూపిస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 10, 2023, 01:44 AM IST
Hair Care Tips: మీ ఇంట్లో తయారు చేసే మ్యాజిక్ ఆయిల్‌తో కేశ సమస్యలన్నీ దూరం

Hair Care Tips: ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా మహిళల్లో జట్టు అందంగా, మృదువుగా, కోమలంగా, నల్లగా నిగనిగలాడుతూ ఉండాలని ఉంటుంది. కానీ ఆధునిక జీవనశైలి, కాలుష్యం, చెడు ఆహారపు అలవార్టల కారణంగా ఇది సాధ్యం కాదు సరికదా జుట్టు రాలడం, డాండ్రఫ్, కేశాలు నిర్జీవంగా మారడం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. 

అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్కెట్‌లో లభించే వివిధ ఉత్పత్పుల కంటే హోమ్ మేడ్ చిట్కాలను ఆశ్రయిస్తే మంచిది. ఇంట్లోనే సొంతంగా యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కేవలం మూడు వస్తువులతో తయారు చేసుకునే ఈ మేజికల్ హెయిర్ ఆయిల్‌తో కేశాల సంబంధిత సమస్యలు దూరం చేయవచ్చు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు మీ కేశాలు పటిష్టంగా మారతాయి. జుట్టు మీరు కోరుకున్నట్టే నల్లగా నిగనిగలాడుతాయి. జుట్టు సంబంధిత సమస్యల్ని సకాలంలో పరిష్కరించకపోతే బట్టతల ముప్పు కూడా ఉండనే ఉంటుంది. మార్కెట్ లో ఈ అన్ని సమస్యలకు కొన్ని రకాల క్రీములు అందుబాటులో ఉన్నా అవి ఏ మేరకు పనిచేస్తాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. 

హోమ్ మేడ్ యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తయారీకు ఒ ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ అల్లోవెరా జెల్, ఆవాల నూనె అవసరమౌతాయి. యాంటీ హెయిల్ ఫాల్ ఆయిల్ తయారు చేసేందుకు ముందుగా ఉల్లిపాయ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసి గట్టిగా పిండి రసం తీయాలి. ఆ తరువాత ఈ రసంలో ఒక టేబుల్ స్పూన్ అల్లోవెరా జెల్ , ఆవాల నూనె కలపాలి. ఈ మూడింటినీ బాగా కలుపుకోవాలి. అంతే మీక్కావల్సిన యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తయారైనట్టే.

ఇప్పుడు యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్‌ను తీసుకుని మీ కేశాల కుదుళ్లకు బాగా పట్టించాలి.  ఓ 5 నిమిషాలు చేతితో నెమ్మదిగా మస్సాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ఓ అరగంట వదిలేయాలి. ఇప్పుడు మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే కేశాల్లో పూర్తి మార్పు కన్పిస్తుంది. మీ కేశాలు ఆరోగ్యంగా మారడమే కాకుండా నిగనిగలాడుతాయి. ఇక జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. అంతేకాదు..కేశాల ఎదుగుదల కూడా మెరుగుపడుతుంది. 

Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News