Hair Loss Risk: పూర్వకాలంలో బట్టతల అనేది వృద్ధాప్యానికి ఓ సంకేతంగా పెద్దలు భావించేవారు. అయితే ఈ రోజుల్లో 25 నుంచి 30 సంవత్సరాల యువత కూడా జుట్టు రాలిపోయి. వెంట్రుకల సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరు పెళ్లికి ముందే జుట్టు పూర్తిగా రాలిపోతోంది. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం జన్యుపరమైన సంబంధం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడనికి గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లోని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ ఈ విధంగా తెలుపుతున్నారు. అయితే యువత కొన్నిరకాల కలుషి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
వీటిని అస్సలు తీసుకోవద్దు:
1. చక్కెర:
మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా చక్కెరను తీసుకోవద్దని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే సాధరణ వ్యక్తులు కూడా అధిక పరిమాణం చెక్కరను తీసుకుంటే జుట్టు రాలడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. జంక్, ఫాస్ట్ ఫుడ్స్:
నేటి యువత మార్కెట్లలో లభించే జంక్, ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇవి తరచుగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వారికి తెయదు..! అయితే ఇందులో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్ బరువును పెంచడమే కాకుండా జుట్టుకు నష్టం కలిగిస్తుదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే డిహెచ్‌టి అనే ఆండ్రోజెన్ బట్టతలని తచ్చేందుకు దోహదపడుతుందని నిపుణుల తెలుపుతున్నారు. అంతేకాకుండా జుట్టు పెరుగుదలలో సమస్యలను కలిగిస్తుంది.
3. కలుషితమైన చేపలు:
చేపలు తినడం వల్ల శరీరానికి కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. కానీ కొన్ని మార్కెట్స్‌లో కలుషితమైన చేపలను విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
4. వైన్:
ప్రస్తుతం భారత్‌లో పదిలో ఐదవ వంతు మంది మద్యం సేవిస్తున్నారు. అయితే క్రమం తప్పకుండా మద్యం సేవిచడం వల్ల కూడా జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
5. పచ్చి గుడ్డులోని తెల్లసొన:
గుడ్లు తినడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, సహజ కొవ్వు లభిస్తాయి. అంతేకాకుండా జుట్టు పెరగడానికి ఇది సహకరిస్తుంది. కానీ వీటిని క్రమం తప్పకుండా పచ్చిగా తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చి.. జుట్టు సమస్యలకు దారీ తిసే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున గుడ్లను పచ్చిగా క్రమం తప్పకుండా తినొద్దని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?
Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook