ప్రస్తుతం దేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దోమకాటుతో వ్యాపించే ఈ వ్యాధి పట్ల అప్రమత్తత చాలా చాలా అవసరం. అందుకే కొన్ని రకాల పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఆ పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం.
దోమకాటుతో వ్యాపించే డెంగ్యూ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దోమలు ఎక్కువగా ఉండటం ప్రధాన కారణాలు. డెంగ్యూ సోకినప్పుడు సరైన ఆహార పదార్ధాలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. అదే సమయంలో సమయానికి చికిత్స లేకపోతే ప్రాణాంతకం కావచ్చు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకూ ఉంటాయి. అందుకే డెంగ్యూ రోగులకు మజిల్ పెయిన్స్, ర్యాషెస్, వాంతులు, తీవ్రమైన జ్వరం ఉంటాయి. సకాలంలో చికిత్స కూడా చాలా అవసరం లేకపోతే ప్రాణాలు పోవచ్చు. సరైన ఆహార పదార్ధాలు తీసుకుంటే..డెంగ్యూ నుంచి త్వరగానే కోలుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాలి.
డెంగ్యూ రోగులు తినకూడదని పదార్ధాలు
మసాలా పదార్ధాలు
డెంగ్యూ రోగులు మసాలా పదార్ధాలకు దూరంగా ఉండాలి. మసాలా పదార్ధాలు తినడం వల్ల డెంగ్యూ రోగులకు సమస్య పెరుగుతుంది. ఎందుకంటే మసాలా భోజనం తినడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. డెంగ్యూ జ్వరం పెరగడానికి కారణమౌతుంది.
జంక్ ఫుడ్స్
జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ పదార్ధాలు ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. అందుకే డెంగ్యూ రోగులు ఈ పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఈ రకమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల రక్తపోటు అధికమౌతుంది. ఫలితంగా డెంగ్యూ నుంచి కోలుకోవడం ఆలస్యమౌతుంది.
ఆల్కహాల్
డెంగ్యూతో బాధపడుతున్న రోగులు పొరపాటున కూడా ఆల్కహాల్ సేవించకూడదు. ఎందుకంటే మద్యం తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా రోగికి ప్లేట్‌లెట్ సమస్య ఏర్పడుతుంది. డెంగ్యూ సోకినప్పుడు సాధ్యమైనంతవరకూ కొబ్బరినీళ్లు తాగడం అత్యుత్తమం.
కాఫీ
డెంగ్యూ సోకినప్పుడు కెఫీన్ అధికంగా ఉండే కాఫీ వంటివి తాగడం వల్ల శరకీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా ప్లేట్‌లెట్స్ కొరత ఏర్పడుతుంది. డెంగ్యూ తీవ్రమౌతుంది.
Also read: Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ మూడింటికి దూరంగా ఉండాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook