Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ మూడింటికి దూరంగా ఉండాలి

Liver Health: శరీరంలో లివర్ అతి ముఖ్యమైన అంగం. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. హెల్తీ లివర్ కోసం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి,  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2022, 03:59 PM IST
Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ మూడింటికి దూరంగా ఉండాలి

రోజూ తీసుకునే ఆహార పదార్ధాలపై ఆధారపడి ఆరోగ్యం ఉంటుంది. శరీరంలోని వివిధ అంగాల పనితీరు ప్రభావితమౌతుంటుంది. ఇందులో కీలకమైంది లివర్. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..కొన్ని పదార్ధాలను తీసుకోకూడదు. ఆ వివరాలు మీ కోసం..

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలోని విషపదార్ధాల్ని బయటకు తొలగించడమే కాకుండా..విటమిన్లను స్టోర్ చేసి ఎనర్జీగా మార్చడం లివర్ చేసే పని. లివర్ యాక్టివిటీ ఎప్పుడూ నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని తీసుకోకూడదు. లివర్ ఆరోగ్యం కోసం తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

లివర్ ఆరోగ్యంగా ఉంచేందుకు ఏ పదార్ధాలకు దూరంగా ఉండాలి

ఉప్పు

ఉప్పు..లివర్‌ను నష్టపరుస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే శరీరంలో వాటర్ రిటెన్షన్ ఏర్పడుతుంది. 

నిద్ర

ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలామందికి సరైన నిద్ర ఉండటం లేదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి మంచిది కాదు. లివర్‌కు కూడా మంచిది కాదు. మెరుగైన ఆరోగ్యం కోసం పోషక పదార్ధాలు, ఆహారం, నీరు, సరైన నిద్ర అనేది చాలా చాలా అవసరం. ఒకవేళ సరైన నిద్ర లేకపోతే..చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. తగినంత నిద్ర లేకపోతే..లివర్ ఆక్సిడేటివ్ ఒత్తిడి పెంచుతుంది. అందుకే తగినంత సుఖమైన నిద్ర అనేది చాలా అవసరం.

అల్కహాల్

ఆల్కహాల్ అతిగా తీసుకుంటే ఆ ప్రభావం నేరుగా లివర్‌పైనే పడుతుంటుంది. పలితంగా లివర్ దెబ్బతింటుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి విష పదార్ధాల్ని తొలగించే లివర్ సామర్ధ్యం తగ్గిపోతుంది. అందుకే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. 

Also read: Diabetes Control Tips: ఈ ఆకుల టీతో కూడా ఎలాంటి ఖర్చు లేకుండా మధుమేహాన్ని 3 రోజుల్లో నియంత్రించవచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News