Dates Benefits: మధుమేహం వ్యాధిగ్రస్థులు ఖర్జూరం తినవచ్చా లేదా, వాస్తవమేంటి

Dates Benefits: ఆరోగ్యం మహా భాగ్యమంటారు. మరి ఆరోగ్యంగా జీవించాలంటే ఏం కావాలి. సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే శరీరంలో అందుకు తగిన పోషకాలు సమృద్ధిగా ఉండాలి. కొన్ని రకాల పండ్లలో అన్ని రకాల పోషకాలు కావల్సినంతగా లభిస్తాయి..అందుకే సాధ్యమైనంతవరకూ ఫ్రూట్స్ తినమని సూచిస్తుంటారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2023, 10:08 PM IST
Dates Benefits: మధుమేహం వ్యాధిగ్రస్థులు ఖర్జూరం తినవచ్చా లేదా, వాస్తవమేంటి

Dates Benefits: ఎడారి ఫ్రూట్‌గా పిలిచే ఖర్జూరం నిజంగానే అమృతం లాంటిది. ఆరోగ్యపరంగా ఖర్జూరం పండ్లలో లెక్కకుమించిన ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించేది కావడంతో ఎముకలు బలంగా మారతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

మనిషి ఫిట్ అండ్ హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే అన్నింటికంటే ముఖ్యమైంది ఎముకలు బలంగా ఉండటం. సాధారణంగా ఎముకలు బలహీనపడటం అనేది వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్య. కానీ ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల తక్కువ వయస్సుకే ప్రభావితమౌతున్నారు. ఎముకలు బలహీనంగా ఉంటే..ఖర్జూరం తప్పకుండా తినాలి. రోజుకు 2-3 ఖర్జూరం పండ్లు క్రమం తప్పకుండా తింటే ఎమకలు బలంగా మారడమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే ఖర్జూరం రోజూ తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యను నివారించవచ్చు. ఖర్జూరం గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువ కావడంతో మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. రోజుకు  2-3 ఖర్జూరం పండ్లు తినడం ఆరోగ్యానికి మంంచిది.

వయస్సు పెరిగే కొద్దీ మెదడు కూడా షార్ప్‌గా ఉండాలంటే ఖర్జూరం తప్పనిసరిగా తీసుకోవాలి. రోజూ క్రమ పద్ధతిలో ఖర్జూరం తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడులో వాపు కూడా తగ్గుతుంది. ఖర్జూరం రోజూ తింటే అల్జీమర్స్ వంటి వ్యాధులు దూరమౌతాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో ఉండే ప్రీ రాడికల్స్ నాశనమౌతాయి. 

ఇక ఖర్జూరంలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. మలబద్ధకం సమస్యను తొలగించడంలో దోహదపడుతుంది. 

Also read: Typhoid Precautions: పెరుగుతున్న టైఫాయిడ్ కేసులు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లక్షణాలెలా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News