Blood Pressure Diet: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు..బీపీ ఎంత ఉన్నా నార్మల్ అయిపోతుంది

Blood Pressure Diet: ఆధునిక జీవన విధానంలో  చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థ జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ సమస్యల్లో ముఖ్యమైంది, ప్రమాదకరమైంది అధిక రక్తపోటు. ఈ ఒక్క సమస్య ఇతర సమస్యలకు కారణం కావచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 25, 2023, 10:56 PM IST
Blood Pressure Diet: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు..బీపీ ఎంత ఉన్నా నార్మల్ అయిపోతుంది

Blood Pressure Diet: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రమాదకర వ్యాధుల్లో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ వ్యాధులు ముఖ్యమైనవి. ఇందులో ఎక్కువమందిలో కామన్‌గా కన్పించేది ఆధిక రక్తపోటు. రక్తపోటును నియంత్రించడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. జీవనశైలిలో మార్పులు చేస్తే చాలు...

వాస్తవానికి అధిక రక్తపోటు అనేది పైకి కన్పించేంత సామాన్యమైంది కాదు. ఇదొక సైలెంట్ కిల్లర్. వయస్సుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఎదురౌతుంది. జీవనశైలి అస్తవ్యస్థంగా ఉన్నవారిలో, ఫిజికల్ యాక్టివిటీ లేనివారిలో, చెడు ఆహారపు అలవాట్లు ఉండేవారిలో ఈ సమస్య అధికంగా ఉంది. ఇలాంటి జీవన విదానానికి అలవాటు పడేది ఎక్కువగా యుక్త వయస్సువారే. అంటే యుక్త వయస్సువాళ్లే ఎక్కువగా బీపీకు గురవుతున్నారు. అధిక రక్తపోటునే హైపర్ టెన్షన్‌గా కూడా పిలుస్తుంటారు. సాధారణ రక్తపోటు అంటే 120-80 ఉంటుంది. కాని అదే 140-90 ఉంటే అధిక రక్తపోటుగా భావించాలి. కొంతమందిలో ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. ఈ స్థితి ప్రమాదకరం. సకాలంలో బీపీని నియంత్రంచకపోతే గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే డైట్, లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 

అధిక రక్తపోటు సమస్య నుంచి గట్టెక్కేందుకు డైట్‌లో వీట్‌గ్రాస్ అంటే గోధుమ గడ్డిని భాగంగా చేసుకోవాలి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది నియంత్రణలో ఉంటుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరో చిట్కా కొబ్బరి నీళ్లు. అధిక రక్తపోటు సమస్యకు కొబ్బరి నీళ్లు అద్భుతమైన పరిష్కారం.  రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ లోటు ఉండదు. దాంతోపాటు రక్తపోటు సమస్య కూడా పరిష్కారమౌతుంది. 

అధిక రక్తపోటు సమస్య ఉంటే వెల్లుల్లి అద్భుతమైన ఔషధమంటారు. ఆయుర్వేద వైద్యంలో కూడా దీని ప్రస్తావన ఉంది. రోజూ పచ్చి వెల్లుల్లి తింటే మీ బ్లెడ్ వెసెల్స్ విస్తరించి రక్తం సులభంగా సరఫరా అయ్యేందుకు దోహదపడతాయి. అందుకే మీ డైట్‌లో వెల్లుల్లి ఉండేట్టు చూసుకోండి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రోజూ డైట్‌లో ఒక కప్పు పెరుగు ఉండేట్టు చూసుకోండి. రోజూ క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీపీ సమస్య తగ్గుతుంది.

Also read: Dry fruits Benefits: డ్రై ఫ్రూట్స్‌లో తేనె కలిపి తింటే కలిగే 5 అద్బుత ప్రయోజనాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News