Kidney Health Tips: మీ కిడ్నీలకు హాని కల్గించేది, లాభం చేకూర్చేది మీ అలవాట్లే, చెక్ చేసుకోండిలా

Kidney Health Tips: శరీరంలోని వివిధ అంగాల్లో అతి ముఖ్యమైంది కిడ్నీలు. గుండె తరువాత అత్యంత కీలక పాత్ర కిడ్నీలదే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఏ విధమైన రోగం దరిచేరదు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2023, 07:01 PM IST
Kidney Health Tips: మీ కిడ్నీలకు హాని కల్గించేది, లాభం చేకూర్చేది మీ అలవాట్లే, చెక్ చేసుకోండిలా

Kidney Health Tips: మనిషి సంపూర్ణ ఆరోగ్యం అనేది ఆ మనిషి శరీరంలోని అంగాల పనితీరుని బట్టి ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ గుండె కీలకభూమిక పోషిస్తుంటే..ఆ రక్తాన్ని శుభ్రపర్చడం విష పదార్ధాలను బయటకు పంపించడం కిడ్నీలు చేసేపని. అందుకే కిడ్నీలను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 

శరీరంలోని విష పదార్ధాల్ని తొలగించి బ్లేడర్‌కు పంపిస్తుంది కిడ్నీ. అక్కడి నుంచి మూత్రం ద్వారా ఆ విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని అలవాట్లు కారణంగా కిడ్నీలో సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవల్సింది ఆహారపు అలవాట్ల గురించి. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మీ ఆహారపు అలవాట్లు బాగుండాలి. జంక్ ఫుడ్, స్వీట్స్ దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్‌లో అధికంగా ఉండే సోడియం అంటే ఉప్పు కిడ్నీపై ప్రభావం చూపిస్తుంది. స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం సమస్య తలెత్తుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ సమస్య దీర్ఘకాలం ఉంటే..కిడ్నీపై ప్రభావం పడుతుంది. 

నీళ్లు ఎంత తాగుతున్నారు

కిడ్నీల ఆరోగ్యం అనేది ప్రధానంగా మనం రోజూ తీసుకునే నీటి పరిమాణాన్ని బట్టి ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా అత్యంత సులభంగా బయటకు తొలగిపోతాయి. నీళ్లు తగిన మోతాదులో తాగకపోతే కిడ్నీలపై ఆ దుష్ప్రభావం కిడ్నీలపైనే పడుతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. 

నిద్రలేమి

ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 8 గంటలు మంచి సుఖమైన నిద్ర ఉండాలి. రోజూ తగిన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నిద్ర సంబంధం నేరుగా కిడ్నీతో ఉంటుంది. నిద్ర తక్కువైతే..కిడ్నీ ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది. దాంతో కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ సరిపడినంత నిద్ర అవసరం. 

అంటే ఆహారపు అలవాట్లతో పాటు జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు లేదా కిడ్నీల పనితీరు మెరుగుపర్చుకోవచ్చు.

Also read: Woman Health Tips: నెలసరి సమయంలో మహిళలు బొప్పాయి తినవచ్చా లేదా, తింటే ఏమౌతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News