Food Habits: రోజూ పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, తీసుకుంటే కలిగే అనర్ధాలేంటి

Food Habits: మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండటమనేది అతని ఆహారపు అలవాట్లు, అతని జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదనేది తెలుసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2023, 03:02 PM IST
Food Habits: రోజూ పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, తీసుకుంటే కలిగే అనర్ధాలేంటి

Food Habits: ఆధునిక జీవనశైలిలో పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులెత్తే జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, వేళలు కూడా మారిపోయాయి. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ముఖ్యంగా లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎదుర్కోవల్సిన పరిస్థితి. అందుకే ఆహారం విషయంలో వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

ఆరోగ్యం ఎప్పటికీ బాగుండాలంటే..తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఆహారపు అలవాట్లు, వేళలు సరిగ్గా ఉండాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాల విషయంలో ఎప్పుడు తినాలనే స్పష్టత అవసరం. లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. ఎందుకంటే రోజూ తినే ఆహార పదార్ధాలు లేదా తీసుకునే ద్రవ పదార్ధాలు ఆరోగ్యంపై పూర్తి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్య నిపుణుల ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని కొన్ని సమయాల్లో తీసుకోకూడదు. జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడతాయి.

ముఖ్యంగా పరగడుపున అన్ని రకాల ఆహారాన్ని తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం తిన్నా అది నేరుగా కడుపులోపలి భాగాలపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.

పరగడుపున మసాలా, కారం లేదా ఫ్లైడ్ పదార్ధాలు తినకూడదు. వీటవల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి. ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.

చాలామందికి బెడ్ కాఫీ లేదా బెడ్ టీ అలవాటు ఉంటుంది. అంటే లేచీ లేవగానే..పరగడుపున కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. ఈ అలవాటు వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం అత్యుత్తమం.

ఇంకొందరైతే ఏకంగా పరగడుపున లేచిన వెంటనే మద్యం తాగుతుంటారు. ఇది మరింత ప్రమాదకరం. పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి..సమస్యలకు కారణమౌతుంది. 

Also read: Diabetes Tips: డైట్‌లో ఈ జ్యూస్‌లు ఉంటే..5 వారాల్లోనే డయాబెటిస్‌కు చెక్, పరీక్షించి చూసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News