Heart Attack Prevention: చిన్న వయసులో గుండె పోటు వస్తే 80 శాతం తగ్గించుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

Heart Attack Prevention: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత త్వరగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగా మారొచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 04:02 PM IST
Heart Attack Prevention: చిన్న వయసులో గుండె పోటు వస్తే 80 శాతం తగ్గించుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

Heart Attack Prevention: వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే గుండె సమస్యలతో బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే ఆరోగ్య నిపుణుల వివరాల ప్రకారం.. పలు రకాల ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అయితే దీని నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు నివారణలు పాటించాల్సి ఉంటుంది.

గుండె జబ్బుతో మరణించే ప్రమాదం:
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలున్న వారు 45 శాతం మరణాలకు కారణమవుతున్నారని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో 22 శాతం మంది శ్వాసకోశ వ్యాధులతో, 12 శాతం మంది క్యాన్సర్‌తో, 3 శాతం మంది మధుమేహంతో మరణిస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.

చిన్న వయసులోనే గుండె జబ్బులను ఇలా నివారించండి:
చిన్న వయసులోనే గుండె సమస్యలను గమనించి వైద్యులను సంప్రదిస్తే 80 శాతం వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ధూమపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది. అంతేకాకుండా వ్యాయామాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది.

ఇంతకీ గుండె జబ్బులు ఎందుకు వస్తాయి?:
గుండె జబ్బులు ప్రధానంగా ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్‌త పరిమాణాలు పెరగడం వల్ల గుండె సమస్యలు ఉత్పన్నమవుతాయి.  దీనిని అథెరోస్క్లెరోసిస్ అని కూడా అంటారు. దీంతో చిన్న వయసులోనే హృదయ సమస్యలతో బాధపడుతున్నారు.

గుండె జబ్బు యొక్క లక్షణాలు
>>ఛాతీ నొప్పి
>>శ్వాస ఆడకపోవడం
>>దడ
>>ఎపిగాస్ట్రిక్
>>గుండెల్లో మంటు
>>తరచుగా చెమటలు పట్టడం

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read: Shradha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..!

Also Read: India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News