Ulcer Symptoms: కడుపు లేదా చిన్న ప్రేగు పై పుండ్లు వస్తే అల్సర్ అంటారు. కడుపులో యాసిడ్ జీర్ణవ్యవస్థను దెబ్బతీసినప్పుడు ఇది అల్సర్‌కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్సర్‌కు కారణం హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కారణంగా కడుపులో ఉండే మ్యూకస్ మెంబరైన్ పొరను దెబ్బతింటుంది.దీంతో కడుపులో పుండ్లు ఏర్పడతాయి. జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువవడం వల్ల కూడా ఈ పొర దెబ్బతింటుంది.
అయితే చాలా మంది అల్సర్ సమస్యను పట్టించుకోరు. దీని కారణంగా తీవ్రమైన పుండ్లుగా మారుతుంది. చికిత్స చేసుకోకుండా ఉండే ఈ సమస్య క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని వైద్యనిపుణులు అంటున్నారు. అయితే అల్సర్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: Women Health Tips: పీరియడ్స్ సమయంలో నొప్పులు తగ్గించేందుకు ఏం తినవచ్చు, ఏం తినకూడదు
అల్సర్ల లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
⁎ కుడపులో అల్సర్లు ఉంటే ముందుగా కడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పి వచ్చే సమయాన్ని కారణంగా అల్సర్ ఎక్కడ వచ్చిందో మనం గుర్తించవచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు నొప్పి వస్తే ఈసోఫాగస్ లో అల్సర్ ఉన్నట్టుగా గుర్తించాలని నిపుణులు అంటున్నారు. వెంటనే కడుపులో నొప్పి వస్తే జీర్ణాశయంలో అల్సర్ ఉన్నట్టుగా తెలుసుకోవాలి.
⁎ రాత్రి సమయంలో తరచుగా నొప్పి వస్తూ ఉంటే చిన్న ప్రేగు మొదటి భాగంలో అల్సర్ ఉన్నట్టుగా భావించాలి.
⁎ కడుపులో అల్సర్లు ఉంటే తరచుగా గొంతులో మంటగా ఉంటుంది. అలాగే ఆకలి వేయడం తగ్గుతుంది.
⁎ అల్సర్లు ఉండడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు.
⁎ అల్సర్ల కారణంగా రక్తహీనత సమస్య తలెత్తుతుంది.
⁎ తరచూ ఛాతిలో నొప్పి వచ్చినట్టయితే కడుపులో అల్సర్లకు సంబంధించిన పరీక్షలు తప్పక చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరమని గ్రహించాలి.
Also read: Soaked Cashew: నానబెట్టిన జీడిపప్పుతో బీపితో మధుమేహానికి కూడా చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి