How To Build Muscle Naturally: శరీరాన్ని అభివృద్ధి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు కండరాలను పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే కండరాలను పెంచుకునే క్రమంలో ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది జిమ్ చేసే క్రమంలో వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొందరిలో ఇది గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది. కావున జాగ్రత్తగా శ్రద్ధపెట్టి పలు రకాల ఆహార నిమాలతో జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేస్తే.. మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కండరాలను పెంచే క్రమంలో ఈ ఆహారాలను తీసుకోండి:
1) గుడ్లు:
గుడ్లలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వీటిలో తెల్లసొనను ఎగ్ వైట్ అని అంటారు. దీనిని మాత్రమే అతిగా తీసుకోవచ్చు. కావున గుడ్లను జిమ్ చేసే క్రమంలో తప్పకుండా తీసుకోవాలి.
2) పాలకూర:
బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీనిని గుడ్లతో పాటు తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. శరీర కండరాలను దృఢంగా చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
3) బీన్స్:
బీన్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు.. ఇందులో ప్రోటీన్, విటమిన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కావున ఉడకబెట్టుకుని తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
4) పాలు:
బాడీ బిల్డర్లు పాలును కంప్లీట్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. షేక్స్, స్మూతీస్ తయారీలో వీటిని అధిక పరిమాణంలో వినియోగిస్తారు. అయితే వీటిలో బాదం పొడిని వేసుకుని తాగితే కండరాలు దృఢంగా మారుతాయి.
5) పెరుగు:
పాలలాగే పెరుగులో కూడా చాలా రకాల పోషక విలువలుంటాయి. శరీరాన్ని పూర్తిగా హైడ్రేట్‌గా ఉంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున జిమ్ చేసే క్రమంలో తప్పకుండా పెరుగును వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
6) చీజ్:
వర్కవుట్స్ చేసిన తర్వాత పనీర్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఆకలిని నియంత్రిస్తుంది. కండరాల సైజును పెంచేందుకు కృషి చేస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook