Walnuts For Blood Pressure: ప్రతిరోజు ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేయకూడదు అంతే కాకుండా విటమిన్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో మానవ శరీరానికి ఎక్కువగా ఉపయోగపడేవంటే వాల్నట్స్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల విటమిన్లు ఫైబర్ ఐరన్ కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు చెరుకుగా తయారవడం కాకుండా రక్తంలో సమస్యలు దూరం అవుతాయి. అయితే దీనిలో ఉండే పోషకాలు శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలపై కూడా ప్రభావం పనిచేస్తాయి.
అధిక రక్త పోటు:
చాలా మంది ప్రస్తుతం వివిధ కారణాల వల్ల అధిక రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నీటిలో నానబెట్టిన వాల్‌నట్స్‌ను ఉదయం పూట టిఫిన్‌కి ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణలు కూడా తగ్గుతాయి.
చర్మ సమస్యలు:
వాతావరణం కాలుష్యం కారణంగా చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అధిక పరిమాణంలో ఉండే వాల్నట్స్ తీసుకోవాలని చర్మ వైద్యులు సూచిస్తున్నారు.
జుట్టు సమస్యలు:
చాలామంది ప్రస్తుతం జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో తగినన్ని పోషకాలు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నీటిలో నానబెట్టిన వాల్నట్స్ ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియ సమస్యలు:
శరీరంలో జీర్ణ క్రియ సమస్యలు తలెత్తడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అధిక ఫైబర్ పరిమాణం ఉండే వాల్నట్స్ ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి.
ఎముకల సమస్యలు:
ప్రస్తుతం చాలామంది లో చిన్న వయసులోనే ఎముకలు దెబ్బతింటున్నాయి. దీనికి కారణంగా శరీరంలో వివిధ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎముకలను దృఢంగా ఉంచుకోవడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎముకలను దృఢంగా ఉంచుకోవడాని నీటిలో నానబెట్టిన వాల్నట్స్ ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
Read Also: TRS VS BJP: కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్.. బీజేపీ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook